Begin typing your search above and press return to search.

కాకలు పుట్టిస్తున్న కేతిక

By:  Tupaki Desk   |   10 April 2019 1:30 AM GMT
కాకలు పుట్టిస్తున్న కేతిక
X
కిల్లింగ్ లుక్స్ తో కాకలు పుట్టించే అందగత్తెల్ని బరిలో దించడంలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తర్వాతనే. ప్రస్తుతం అతడు నిర్మిస్తున్న రెండు సినిమాల్లో కథానాయికలు వేడెక్కించే కంటెంట్ ఉన్న భామలే. రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్, నభా నటేష్ లాంటి భామలు హీటెక్కిస్తున్నారు. ఇక పూరి తనయుడు ఆకాష్ పూరి సరసన అంతే వేడెక్కించే అందగత్తెను సెలెక్ట్ చేసుకున్నారు పూరి. ఆకాష్ నటిస్తున్న `రొమాంటిక్` చిత్రంతో ముంబై టీవీ పరిశ్రమతో అనుబంధం ఉన్న టాప్ మోడల్ కేతిక శర్మను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు.

ఇప్పటికే కేతిక శర్మ ఈ చిత్రంలో ఎలా కనిపించబోతోంది? అన్న లుక్ మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో లుక్ కి మాత్రం యువతరం నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ అమ్మడు ఇన్ స్టాగ్రమ్ లో జరంత స్పడ్ గానే ఉంటోంది. అక్కడ నిరంతరం కొత్త కొత్త ఫోటోలు - వీడియోల్ని అప్ లోడ్ చేస్తోంది. కేతిక ఇటీవలే జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనే పూరి ఫ్యాన్స్ ఈ శర్మా గాళ్ ని పలకరించేస్తున్నారు.

పూరి సెలక్షన్ ని అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. మెహబూబా తర్వాత ఆకాష్ పూరికి ఎంతో కీలకమైన చిత్రమిది. నటించిన తొలి సినిమాతోనే ఆకాష్ నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక రెండో సినిమాతో ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలన్న పంతం కనబరుస్తున్నాడు. రొమాంటిక్ మూవీ చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఈ సమ్మర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. పూరి.. ఛార్మి జోడీ కలిసి ఈ చిత్రాల్ని నిర్మిస్తున్నారు.