Begin typing your search above and press return to search.

బీచ్ ని షేకాడించిన పూరి డిస్క‌వ‌రీ

By:  Tupaki Desk   |   24 Dec 2019 12:51 PM GMT
బీచ్ ని షేకాడించిన పూరి డిస్క‌వ‌రీ
X
పూరి అంటే మాస్ .. మాస్ అంటే పూరి. ఇక‌ బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ అన‌గానే గుర్తొచ్చే పేరు పూరీనే. ముఖ్యంగా గోవా - బ్యాంకాక్- ప‌టాయా బీచ్ ల‌లో ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌ను వెతికి అక్క‌డ అందాల నాయిక‌ల్ని ప్రెజెంట్ చేయ‌డంలో పూరి మార్క్ ట్రీట్ వేరేగా ఉంటుంది. తెర‌పై చూసి అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించిన వారు ఈజీగానే అర్థం చేసుకుంటారు సుమీ. ఇలియానా నుంచి ముమైతే.. ఆండ్రియా వ‌ర‌కూ నాయిక‌లంద‌రినీ బికినీ బీచ్ హాటీలుగా ఆవిష్క‌రించారు.

ఇటీవ‌లే ఇస్మార్ట్ హిట్ కొట్టిన హుషారులో ప్ర‌స్తుతం `రొమాంటిక్` షూటింగ్ ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. త‌న‌యుడు ఆకాష్ పూరి న‌టించిన తొలి చిత్రం `మెహ‌బూబా` ఫ్లాప‌వ్వ‌డంతో ఈసారి ఆ త‌ప్పును రిపీట్ కాకుండా చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందుకోసం పూరి- ఛార్మి బృందం తెలివైన ప్ర‌చార ఎత్తుగ‌డ‌ల‌తో దూసుకెళుతున్నారు. మొన్న‌టికి మొన్న ఆకాష్ - కేతిక శ‌ర్మ జంట రొమాన్స్ కి సంబంధించిన లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేసి యూత్ లో కిక్కు పెంచాడు. కేతిక బ్యాక్ లెస్ ఫోజుల‌కు.. అందాల ఆర‌బోత‌కు టీనేజీ బోయ్స్ కంటికి కునుకు క‌రువై పోయారు.

తాజాగా కేతిక లుక్ కి సంబంధించిన పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్ లో పొట్టి నిక్క‌రులో బీచ్ ని షేక్ చేసింది అమ్మ‌డు. బీచ్ ఇసుక‌లో మ‌త్తెక్కిన క‌ళ్ల‌తో చిత్తు చిత్తు చేస్తోంది. ఒక‌ర‌కంగా రొమాంటిక్ టీమ్ కేతిక‌కు అదిరిపోయే బ‌ర్త్ డే ట్రీట్ ని ఇచ్చింద‌నే చెప్పాలి. ఉత్త‌రాది బ్యూటీ కేతిక మొద‌టి సినిమాతోనే కిర్రాక్ పుట్టిస్తోంది. రొమాంటిక్ స‌క్సెసైతే అటుపై టాలీవుడ్ ని కూడా షేక్ చేస్తుందేమో. అనీల్ పాడూరి(ద‌ర్శ‌కుడు)- పూరి (నిర్మాత‌) బృందం కేతికను తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ప్రమోట్ చేసే బాధ్య‌త‌ను తీసుకున్నారు. మ‌రి చూడాలి అమ్మ‌డి భ‌విత‌వ్యం!