Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సన్నీ లియోన్ కు అక్క!

By:  Tupaki Desk   |   13 Aug 2019 8:53 AM GMT
ఫోటో స్టొరీ: సన్నీ లియోన్ కు అక్క!
X
హాటు భామలు చాలామందే ఉంటారు కానీ అందరికీ ఒకే చూపుతో మంటలు పెట్టగలిగే టాలెంట్ ఉండదు. కానీ ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ ఆ పనిని చిటికెలో చెయ్యగలదు. కేతిక ఒక పాపులర్ మోడల్. ఈ భామ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు కానీ యూట్యూబ్ లో డబ్ స్మాష్ విడియోలతో సంచలనం సృష్టిస్తోంది. డబ్ స్మాష్ వీడియోలు చూసేవారికి ఈ భామ పేరు తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పనవసరం లేదు. ఇన్స్టా గ్రామ్ లో ఈ భామకు 1.6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు.

రీసెంట్ గా కేతిక తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు "సూర్యుని వెలుగులో ఉండండి.. సహజమైన గాలిని పీల్చండి" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ చూస్తుంటే ఈ కేతికలో హాట్ అపరిచితురాలే కాదు ఒక ప్రకృతి ప్రేమికురాలు కూడా ఉందని అనిపిస్తోంది కదా? ఈ ఫోటోలో ముత్యాలున్న క్రీమ్ కలర్ ఛోళీ.. డార్క్ పింక్ కలర్ లెహెంగా ధరించి ఒక ఒక గ్లాస్ విండో దగ్గర నిలుచుంది. రెడ్ కలర్ లిప్ స్టిక్.. చేతికి చేతికి గాజులు.. చెవి కమ్మలు...లూజ్ హెయిర్ తో సెక్సీగా నిలబడింది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ హరీ అన్నట్టుగా పరువాలను ఇన్స్టాగ్రామ్ డిజిటల్ తీగపై ఆరేస్తూ నిలబడి ఒక ఘాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. పెద్దగా శ్రమ పడకుండా ఒకే చూపుతో మంట పెట్టడం అంటే ఇదే.

ఈ ఫోటోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. "మంచిది. అన్ని టెన్షన్ల మధ్యలో ఒక మంచి ఫోటో చూపించావు".. "సెక్సీ బ్యూటీ".. "సన్నీ లియోన్ కు అక్కలా ఉన్నావు".. "అల్టిమేట్.. హాటు బాంబు" అంటూ కామెంట్లు పెట్టారు.