Begin typing your search above and press return to search.

కిర్రాక్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన రొమాంటిక్ గాళ్

By:  Tupaki Desk   |   14 Jun 2022 4:30 AM GMT
కిర్రాక్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టిన రొమాంటిక్ గాళ్
X
ఆకాశ్ పూరి `రొమాంటిక్` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది కేతిక శ‌ర్మ‌. ఈ ఉత్త‌రాది బ్యూటీ త‌న‌దైన‌ అందం న‌ట‌న‌తో మైమ‌రిపించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా కెరీర్ ని సాగిస్తోంది. వ‌రుస‌గా యువ‌హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది.

ఇంత‌కుముందు యువ కథానాయకుడు నాగశౌర్య `లక్ష్య` సినిమాలోనూ హీరోయిన్ గా నటించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ స‌ర‌స‌న `రంగ రంగ వైభవంగా` చిత్రంలో నటిస్తోంది. ఈ ఏడాది ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో త‌న రేంజును మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లాల‌నే ప్ర‌య‌త్నంలో ఉందిట ఈ భామ‌. అదే క్ర‌మంలో సోష‌ల్ మీడియాల్లోనూ త‌న ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో ఉంది. దానికి త‌గ్గ‌ట్టే నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్లు.. వీడియో షూట్ల‌ను కేతిక షేర్ చేస్తోంది. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ మెల్విన్ లూయిస్ తో కేతిక‌ కొత్త డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది.

ఇందులో అద్భుత‌మైన డ్యాన్స్ మూవ్స్ తో కేతిక మ‌తులు చెడ‌గొడుతోంది. అస‌లే పొట్టి మిడ్డీ టాప్ తో క‌నిపించిన కేతిక అలా స్టెప్పులు వేస్తుంటే థై సొగ‌సుల హిందోళం కుర్ర‌కారుకు స్పెష‌ల్ ట్రీట్ గా మారింది. ప్ర‌స్తుతం ఈ వీడియో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారుతోంది.

మెల్విన్ - కేతికా శర్మ జోడీ గతంలో చాలా డ్యాన్సింగ్ వీడియోలను షేర్ చేసారు. కేతిక‌కు అత‌డు డ్యాన్స్ కోచ్ గానూ ఉన్నారు. తాజాగా వారు బాలీవుడ్ చార్ట్ బస్టర్ `జూమ్` తో ముందుకు వ‌చ్చారు. ఈ పాట‌లో ఎంతో గ్రేస్ ని చూపించిన జంట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. కేతిక డ్యాన్సుల‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

అగ్ర హీరోల సినిమాల్లో అవ‌కాశాలు?

కేతిక అంద‌చందాల‌కు ప‌లువురు అగ్ర హీరోలు ముగ్ధులైపోయార‌ని త‌మ సినిమాల్లో ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ని కూడా ఇంత‌కుముందు ప్ర‌చార‌మైంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ స‌ర‌స‌న ఈ భామ న‌టించే వీలుంద‌ని కూడా గుస‌గుస వినిపించినా దానిపైనా అధికారికంగా ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు.