Begin typing your search above and press return to search.

మతం మారకుంటే నరికేస్తామన్నారు

By:  Tupaki Desk   |   22 July 2017 4:01 PM IST
మతం మారకుంటే నరికేస్తామన్నారు
X
మత మార్పిడుల కోసం తాయిలాలు ఇవ్వడం ఓ పద్ధతి. ఐతే కొన్ని చోట్ల ఈ విషయంలో తీవ్రమైన హెచ్చరికలు కూడా అందుతున్నాయి. తాజాగా కేరళలో ఓ ప్రముఖుడికి మతం మార్చుకోవాలంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులు రావడం గమనార్హం. ప్రముఖ మలయాళీ రచయిత కేపీ రమనున్నికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారాలని.. లేదంటే కుడి చేయి.. ఎడమ కాలు నరికేస్తామని బెదిరిస్తూ ఆయనకు లేఖ వచ్చింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు రోజుల కిందటే తనకీ లేఖ అందినట్లు కేపీ రమనున్ని తెలిపారు.

‘‘ప్రొఫెసర్‌ జోసెఫ్‌ మాదిరే మీ కాలూ చెయ్యి కూడా రకుతాం.. ఇస్లాం మతంలోకి మారకపోతే అల్లా ఇచ్చే శిక్షలను అమలుచేస్తాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు దుండగులు. ఓ కళాశాలలో పని చేసే జోసెఫ్ అనే ప్రొఫెసర్ ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచేలా పేర్కొన్నారంటూ ఆయన చేయి నరికేశారు. ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తూ కేపీకి లేఖ పంపారు. మలప్పురం జిల్లాలోని మంజేరీ అనే ప్రాంతం నుంచి ఈ లేఖ పంపినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ఎవరు రాశారో తనకు తెలియదని.. తనకు ఎవరితో శత్రుత్వం లేదని ఆయన తెలిపారు. తాను ముందు ఈ లేఖను పట్టించుకోలేదని.. ఐతే కొందరు రచయితల సలహాతో ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. కేరళకు చెందిన పలువురు యువకులు ఇటీవలి కాలంలో ఐఎస్ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులుగా మాుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లేఖ రావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.