Begin typing your search above and press return to search.

నెవర్ బిఫోర్ అంటున్న సాహో మాస్టర్

By:  Tupaki Desk   |   16 March 2019 8:52 AM GMT
నెవర్ బిఫోర్ అంటున్న సాహో మాస్టర్
X
టాలీవుడ్ లో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎప్పుడు ముగిస్తారు అనే విషయం మీద క్లారిటీ లేనప్పటికీ ఆగస్ట్ 15న విడుదల అవుతుందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. డేట్ గతంలో ప్రకటించారు కాని చాప్టర్స్ పేరుతో వదిలిన రెండు వీడియోలలో ఆ ప్రస్తావన తీసుకురాలేదు.

ఇదిలా ఉండగా సాహో స్టంట్ మాస్టర్ గా హాలీవుడ్ నుంచి వచ్చిన కెన్ని బేట్స్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో భారీ హై వోల్టేజ్ చేజ్ ని తీసింది ఇతనే. హైదరాబాద్ షెడ్యూల్స్ కోసం వచ్చి వెళ్తూ ఉన్నాడు. ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో తీసుకుంటున్న రిస్క్ చూసి కెన్ని షాక్ అవుతున్నాడని యూనిట్ నుంచి సమాచారం

సాధారణంగా ఏ చిన్న రిస్క్ ఉన్న సీన్ అయినా బాడీ డబుల్ ఉపయోగించడం సర్వ సాధారణం. ఇది ఎన్టీఆర్ జమానా నుంచే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో హీరోలు సహజత్వం కోసం డూప్ ని పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రభాస్ అంతకు మించి అనేలా ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడు అంటే సాహోలో చాలా బలమైన కంటెంట్ ఉందనేగా.

శ్రద్ధ కపూర్ హీరొయిన్ గా నటిస్తున్న సాహోలో ఇప్పటి దాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని రియల్ స్టంట్స్ ఉంటాయని వినికిడి. ప్రమోషన్ మొదలుపెట్టాక కెన్ని బేట్స్ తో ఏదో ఇంటర్ నేషనల్ ఛానల్ కోసం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నాడట సుజిత్. అంతర్జాతీయా స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న సాహోకు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి మరి