Begin typing your search above and press return to search.

హీరో ఇంటిని మోడల్ కొనేసింది

By:  Tupaki Desk   |   2 July 2016 5:13 AM GMT
హీరో ఇంటిని మోడల్ కొనేసింది
X
అవును నిజమే. అక్షరాల ఇదే జరిగింది. కాకుంటే.. మన దగ్గర కాదు హాలీవుడ్ లో. ఒక మోడల్ ఒక హాలీవుడ్ హీరో ఇంటిని సింగిల్ హ్యాండ్ తో కొనేసి.. తాజాగా వార్తల్లోకి వచ్చింది. హాలీవుడ్ హీరో జాన్ క్రాసిన్ స్కీ తన లగ్జరీ ఇంటిని 8 మిలియన్ డాలర్లకు అమ్ముతున్నట్లుగా ప్రకటించాడు. ఎంత లగ్జరీ ఇల్లు అయితే మాత్రం 8 మిలియన్లా? అంటూ పెదవి విరిచి.. ఆ డీల్ ను క్లోజ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఇలాంటి వేళలో అమెరికా సూపర్ మోడల్ కెండల్జెన్నర్ ఈ ఇంటిని 6.5 మిలియన్లకు కొనుగోలు చేయటం అందరిని ఆకర్షిస్తోంది.

ఆరు లగ్జరీ బెడ్రూమ్స్ తో పాటు.. విశాలమైన హాల్స్.. ఐదు బాత్రూమ్స్ ఉన్న ఈ ఇంట్లో విశేషాలకు కొదవలేదని చెబుతున్నారు. ఈ ఇంటికి దగ్గర్లో ఒక ఫేమస్ హోటల్ కూడా ఉందని చెబుతున్నారు. ఇలా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయటం ఈ మోడల్ కు అలవాటే. ఇదే తీరులో రెండేళ్ల క్రితం 1.39 మిలియన్ డాలర్లకు ఒక ఇంటిని కొనేసిన ఈ అమ్మడు తాజాగా హాలీవుడ్ హీరో ఇంటిని చేజిక్కించుకోవటంపై ఫుల్ ఖుషీగా ఉంది. తాజాగా కొన్న ఇంటి చుట్టూ కొండలు.. గుట్టలతో చాలా క్యూట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది. చేతిలో డబ్బులతో పాటు.. టేస్ట్ ఉంటే ఇలాంటివి సొంతం చేసుకోవచ్చు మరి.