Begin typing your search above and press return to search.
ఆ సినిమా కోసం కీర్తి సురేష్ ని ఎవరూ సంప్రదించలేదట...!
By: Tupaki Desk | 30 April 2020 1:20 PM ISTప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ అద్భుతంగా రపొందించిన ఈ చిత్రం కీర్తి సురేష్ లోని నటిని ప్రపంచానికి పరిచయం చేసింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆరాధించే నటి సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ జీవించేసింది. మహానటి సావిత్రి పాత్రకు ఎవరూ ఊహించని స్థాయిలో ప్రాణం పోసి విమర్శకులే కాదు సినీ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. ఈ సినిమా తర్వాత అందరూ ఆమెని కీర్తి సురేష్ అనడం మానేసి 'మహానటి' అని పిలుస్తున్నారంటే.. ఎంతగా ఆమెకు ఆ చిత్రం పేరు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఇప్పుడు అలాంటి మరో బయోపిక్ లో కీర్తి నటించబోతుంది అంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అలనాటి నటి, దర్శకురాలు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కునున్నట్టు తెలుస్తోంది. ఈ బయోపిక్ లో విజయ నిర్మల పాత్రలో నటించడానికి కీర్తి సురేష్ తో దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయ నిర్మల బయోపిక్ కోసం నరేష్ కానీ.. ఆమె కుటుంబ సభ్యులు కానీ కీర్తిని సంప్రదించలేదంట. ఆ వార్తలు పుకారేనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టంతా కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న ఎంటర్‌టైనర్ పై వుందని స్పష్టం చేసిందట. కీర్తి సురేష్ ప్రస్తుతం మహిళా ప్రధాన ఇత్రాలైన 'మిస్ ఇండియా' 'పెంగ్వీన్'తో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న 'రంగ్ దే' చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా ఈ వార్తలను విజయ్ నిర్మల తనయుడు, సీనియర్ నరేశ్ కూడా ఖండించారు. విజయ నిర్మల బయోపిక్ ను ఇప్పుడు రూపొందించడం లేదని.. ఆమె బయోపిక్ కోసం ఎవరికీ పర్మిషన్స్ ఇవ్వ లేదని ఆయన చెప్పేశారు. అయితే గత రెండు సంవత్సరాలుగా విజయ నిర్మల జీవిత చరిత్ర స్క్రిప్ట్ మీద తనే వర్క్ చేస్తున్నట్లు వెల్లడించాడు. నేను కొంతకాలం ఆ స్క్రిప్ట్ మీద పనిచేశాను.. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిన తరువాత ఆ స్క్రిప్ట్ పనులు నిలిపివేయబడ్డాయి. విజయ నిర్మల జీవిత కథ తెరపైకి రావాలంటే చాలా లోతుగా పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఈ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని' నరేష్ చెప్పుకొచ్చారు.