Begin typing your search above and press return to search.

మేకప్ లేని చక్కని చుక్కని గుర్తు పట్టారా?

By:  Tupaki Desk   |   22 Feb 2017 4:30 AM GMT
మేకప్ లేని చక్కని చుక్కని గుర్తు పట్టారా?
X
ఈమె ఓ అందాల భామ. ప్రస్తుతం మాంచి జోష్ లో కూడా ఉంది. వరుసగా హిట్స్ కొట్టేస్తోంది. అది కూడా- ఎక్కడో కాదు మన తెలుగు సినిమాల్లోనే.

ఇక్కడున్న భామలే హిట్స్ లేక నానా తంటాలు పడుతూ ఉంటే ఈమె మాత్రం ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడ బాగానే అవకాశాలు పట్టేస్తోంది. ఛాన్సులు రావడం ఒక ఎత్తయితే.. వాటితో హిట్స్ కొట్టేస్తుండడం మరో ఎత్తు. ఇప్పటి వరకూ ఈమె నటించిన తెలుగు సినిమాలన్నీ సక్సెస్ అయిపోయాయ్ తెలుసా? అరంగేట్రం నుంచే ఇలా హిట్ ట్రాక్ మెయింటెయిన్ చెయ్యడం అందరకీ సాధ్యమయ్యే విషయం కాదు. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. ఎవరీమె అంటారా?

ఇంకా గుర్తు పట్టలేదంటే ఎలాగండీ?.. పోనీ మరో క్లూ ఇచ్చేదా.. ఇప్పుడు పవర్ చూపించే ఓ స్టార్ పక్కన ఛాన్స్ పట్టేసి.. మాంత్రికుడితో కలిసి మాయ చేస్తానంటోంది. ఆయన చేసే మాటల గారడీలో నేనూ భాగం అయిపోతాననని చెబుతోంది. ఓ.. అర్ధమైపోయింది కదూ,.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాకి సై అనేసిన కీర్తి సురేష్ అని. మేకప్ లేకపోతే గుర్తుపట్టడం కష్టం కానీ ఇలా కూడా బ్యూటీ బాగానే ఉందిలే!