Begin typing your search above and press return to search.
కీర్తి 'సూపర్ స్టార్' ని సెలెక్ట్ చేసుకుందా..?
By: Tupaki Desk | 29 March 2020 8:07 PM IST'నేను శైలజ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నటి కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే మంచి నటి అని నిరూపించుకుంది. ఆ తర్వాత హీరో నానితో చేసిన 'నేను లోకల్' లో అదరగొట్టింది. తెలుగు తమిళ భాషల్లో వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్లతో నటించిన కీర్తి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తర్వాత తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన 'మహానటి' సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా అనంతరం కథల ఎంపికలో జాగ్రత్తలు వహిస్తూ వస్తోంది కీర్తి. ఒకవైపు 'మహానటి' లాంటి చిత్రాలలో నటిస్తూనే మరోవైపు 'అజ్ఞాతవాసి' లాంటి కమెర్షియల్ సినిమాల్లో నటించింది. ఈ చిత్రం తర్వాత మరే కమెర్షియల్ సినిమాను అంగీకరించని కీర్తి సురేష్ ఇప్పుడు మహేష్ బాబుతో మూవీకి కమిట్ అయిందని సమాచారం.
ఈ విషయాన్ని ఆఫిసిఅల్ గా కీర్తి సురేష్ కంఫర్మ్ చేసిందని సమాచారం. ఈ సినిమా కోసం డైరెక్టర్ పరశురామ్ మహేష్ బాబుతో ఇంతవరకు నటించని హీరోయిన్ ను తీసుకోవాలని డిసైడ్ అయ్యారంట. ఈ చిత్ర నిర్మాతలు కీర్తి సురేష్ కే ఓట్ వేసారంట. ఈ చిత్ర బృందం ఫోన్ కాల్ ద్వారా కీర్తి సురేష్ కి టచ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుందని సమాచారం. కరోనా ప్రభావ పరిస్థితులను బట్టి పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు - కీర్తి సురేష్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్.. రజినీకాంత్ సరసన ఒక చిత్రం - తెలుగులో 'మిస్ ఇండియా' - తమిళంలో 'పెన్ గ్విన్' చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన 'మైదాన్' సినిమా కోసం ఎంపికైంది.