Begin typing your search above and press return to search.
మహానటి పెళ్లి వాయిదా.. కారణం ఇదేనట!
By: Tupaki Desk | 29 Dec 2020 9:15 AM ISTమహానటి' తో దేశవ్యాప్తంగా క్రేజ్ సాధించింది హీరోయిన్ ‘కీర్తి సురేష్’. ఆ చిత్రం ఇటు తెలుగులో, అటు తమిళంలో పెద్ద విజయం సాధించింది. కన్నడ, మలయాళ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు. ఈ చిత్రంలో అద్భుతమైన అభినయం చూపినందుకు జాతీయ ఉత్తమనటి అవార్డు కూడా ఆమెను వరించింది.
అయితే.. సినిమా అవార్డులు వరించినందుకు సంతోషం.. ఇక, నిన్నో అబ్బాయి వరిస్తే మరింత సంతోషం పడతామని అంటున్నారట ఆమె పేరెంట్స్. 28 ఏళ్ల ఈ నటి త్వరగా పెళ్లి చేసుకోవాలని, 30 దాటకుండానే సంసార జీవితంలోకి అడగు పెట్టాలని భావిస్తున్నారట ఆమె తల్లిదండ్రులు.
అయితే.. కీర్తి సురేష్ ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయట. ఆన్ స్క్రీన్ పై తానింకా సాధించాల్సింది చాలా ఉందని భావిస్తోందట. ఇండస్ట్రీలో తనను తాను ఇంకా నిరూపించుకోవాలని అనుకుంటోందట కీర్తి. ఇలాంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న తనను.. ఈ పెళ్లి వార్తలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయట. అటు తల్లిదండ్రల మాటను కాదనలేక.. తన లక్ష్యాన్ని వదులుకోలేక సతమతం అవుతోందట ఈ బ్యూటీ.
కీర్తి సురేష్ ఈ లాక్ డౌన్‌లో 'పెంగ్విన్' చిత్రంతో ఓటీటీలో బోణి కొట్టింది. కానీ ఈ చిత్రం అంతగా వర్కవుట్ కాలేదు. సినిమా యావరేజ్ అయినప్పటికీ.. కీర్తి సురేష్ నటనకు మాత్రం ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'మిస్ ఇండియా' అంటూ వచ్చి, ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన “సర్కారు వారీ పాటా” సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన మరోసారి ఆడిపాడేందుకు సిద్ధమవుతోంది. పవర్ స్టార్ రాబోయే చిత్రాలలో నటించడానికి చర్చలు జరుపుతోందని టాక్.
ఇలాంటి పరిస్థితుల్లో తాను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేదట కీర్తి. తాను పెళ్లి చేసుకుంటానని, అయితే.. మరికొంత సమయం పడుతుందని పేరెంట్స్ కు చెప్పిందట. ఆ విధంగా.. ఈ మహానటి తన పెళ్లి సందడిని వాయిదా వేసినట్లు సమాచారం.