Begin typing your search above and press return to search.

ఆన్ లొకేష‌న్ ద‌ర్శ‌కుడిపై మ‌హాన‌టి ప్ర‌తీకారం

By:  Tupaki Desk   |   3 Dec 2020 10:35 AM IST
ఆన్ లొకేష‌న్ ద‌ర్శ‌కుడిపై మ‌హాన‌టి ప్ర‌తీకారం
X
నితిన్ - కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న రొమాంటిక్ డ్రామా `రంగ్ దే`. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిత్ర‌యూనిట్ ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ లో బిజీగా ఉంది. ఆన్ లొకేష‌న్ నాయ‌కానాయిక‌ల ఆఫ్ ద రికార్డ్ స‌ర‌దా స‌న్నివేవం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది.

కీర్తి చైర్ లో రిలాక్స్ అవూతూ త‌న క‌ళ్ల‌పై ఒక క్లాత్ ని ఉంచింది. త‌న వెన‌కగా విచ్చేసిన నితిన్ - వెంకీ ఆ దృశ్యాన్ని ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే దానికి రివెంజ్ తీర్చుకుంటాన‌ని అంటున్నారు మ‌హాన‌టి.. కీర్తి ఇన్ స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఓ సరదా వీడియోను పంచుకున్నారు. ఆమె తన దర్శకుడు వెంకీ అట్లూరిపై `పగ తీర్చుకుంటున్నా` అనే క్యాప్ష‌న్ ఇచ్చారు.

రంగ్ దే సెట్ ‌లో చిత్రీకరించిన చిన్న వీడియో క్లిప్ ‌లో కీర్తి తన దర్శకుడు వెంకీ అట్లూరిని గొడుగుతో వెంబడిస్తున్న దృశ్యం క‌నిపిస్తోంది. నితిన్ ఇన్ ‌స్టాగ్రామ్ హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తూ,.. కీర్తి ఇలా వ్యాఖ్య‌ను జోడించింది.``నా పగ త్వరలో తీర్చేసుకుంటాను`` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. కీర్తి ప్రతీకారం ఎలా తీర్చుకోబోతోందో కాస్త ఆగితే కానీ తెలీదు. తదుపరి వీడియో వరకు వేచి చూడాల్సిందే. రంగ్ దే ని సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాల‌న్న పంతంతో చిత్ర‌బృందం హార్డ్ వ‌ర్క్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.