Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ 'చిన్న' గా రెడీ..పోరాటం ఫ‌లించేనా?

By:  Tupaki Desk   |   25 April 2022 11:30 PM GMT
కీర్తి సురేష్ చిన్న గా రెడీ..పోరాటం ఫ‌లించేనా?
X
'మహాన‌టి' స‌క్సెస్ త‌ర్వాత కీర్తి సురేష్ కి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. కానీ కంటెంట్ వైఫ‌ల్యంతో ప‌రాజ‌యాలు త‌ప్ప‌లేదు. ఉమెన్ సెంట్రిక్స్ పై ఆస‌క్తి చూపించి వ‌చ్చిన హీరోయిన్ అవ‌కాశాల్ని వ‌దులుకుంది. ఇక్క‌డే కీర్తి సురేష్ డిమాండ్ మార్కెట్ లో త‌గ్గింది. స‌ద‌రు మేక‌ర్స్ ఇత‌ర హీరోయిన్ల‌ని ఛాయిస్ గా తీసుకోవ‌డంతో కీర్తి ప‌లుక‌బ‌డి కాస్త త‌గ్గిన‌ట్లు క‌నిపించింది. అలాగని అమ్మ‌డు త‌న నిబంధ‌న‌ల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు.

స్టిల్ అవే రూల్స్ పెట్టుకుని ముందుకు సాగుతోంది. వృత్తిప‌రంగా ఎలాంటి పాత్ర‌లు ప‌డితే అలాంటి రోల్స్ చేయ‌నని ఇప్ప‌టికీ మొండికేసి కూర్చుంది. వ‌చ్చిన అవ‌కాశాల‌తోనే ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ లో 'సాని కాయిదం' అనే మ‌రో లేడీ ఓరియేంటెడ్ మూవీ చేస్తోంది.

మే 6న సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. తెలుగులో 'చిన్ని' టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌లే సినిమా టీజ‌ర్ కూడా రిలీజ్ అయింది. టీజ‌ర్ లో ఆద్యంతం కీర్తి ఆక‌ట్టుకుంది.

ఇందులో పూర్తిగా డీగ్లామ‌ర్ పాత్ర పోషించింది. త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఓ మ‌హిళ ఎలా ప్ర‌తీకారం తీర్చుకుంది? అన్న అంశంతో తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. కీర్తి డైలాగులు ఆద్యంతం ఆక‌ట్టుకున్నాయి. తెలుగు నాట కీర్తికి ఫాలోయింగ్ బాగుంది. అందుకే తెలుగు అనువాదానికి పెద్ద పీట వేసి రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఆమె గ‌త సినిమా 'గుడ్ ల‌క్ స‌ఖి' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన స‌క్సెస్ అవ్వ‌లేదు. మ‌రి 'చిన్ని' ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుంద‌న్న‌ది కంటెంట్ పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. 'చిన్ని' చిత్రానికి అరుణ్ మాథేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇక కీర్తి సురేష్ తెలుగులో మ‌ళ్లీ బీజీ అవుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేస్ స‌ర‌స‌న 'స‌ర్కారు వారి పాట‌'లో న‌టిస్తోంది. ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న 'ద‌స‌రా'లో న‌టిస్తోంది. ఇంకా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న 'భోళా శంక‌ర్' కి ఎంపికైంది. ఆ ర‌కంగా కీర్తి తెలుగు నాట మ‌ళ్లీ పాపుల‌ర్ అవుతుంది. ఇంకా త‌మిళ్..మ‌ల‌యాళంలోనూ కొన్ని సినిమాలు చేస్తోంది.