Begin typing your search above and press return to search.

భోళా శంకర్ అలా చేస్తే రిస్క్ లో పడ్డట్టే..!

By:  Tupaki Desk   |   2 May 2023 5:00 AM
భోళా శంకర్ అలా చేస్తే రిస్క్ లో పడ్డట్టే..!
X
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా భోళా శంకర్. షాడో తర్వాత మెహర్ రమేష్ తో రిస్క్ చేయాలని ఎవరు అనుకోలేదు. కానీ చిరు మాత్రం అతనికి మరో ఛాన్స్ ఇచ్చారు. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ లో అజిత్ చేసిన వేదాళం రీమేక్ గా ఈ సినిమా వస్తుందని టాక్. చిరు రీ ఎంట్రీ తర్వాత రీమేక్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. అయితే గాడ్ ఫాదర్ ఇచ్చిన షాక్ తో భోళా శంకర్ తర్వాత ఇక రీమేక్ లు చేసేది లేదని గట్టిగా ఫిక్స్ అయ్యాడట.

భోళా శంకర్ సినిమాలో తమన్నా చిరుతో జోడీ కడుతుంటే సినిమాలో కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ రోల్ లో కనిపిస్తుంది. మహానటిగా తన సత్తా చాటుతున్న కీర్తి రీసెంట్ గా దసరాతో కూడా తన టాలెంట్ చూపించింది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి అదరగొట్టేసింది.

కీర్తిని సరిగా వాడుకోవట్లేదు కానీ ఆమెతో ఎలాంటి ప్రయోగాలైనా చేసేయొచ్చు అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. అయితే ఇది ఇప్పుడు భోళా శంకర్ కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. మెగాస్టార్ సినిమాలో సిస్టర్ రోల్ కి కీర్తిని ఎంచుకోవడం పెద్ద షాక్ ఇచ్చింది.

సినిమాలో ఆ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అయినా సక్సెస్ ఫుల్ హీరోయిన్ ఆమెతో ప్రయోగాలు కూడా చేయొచ్చు అనిపించే హీరోయిన్ ని చిరుకి సోదరిగా చేశారు. అఫ్కోర్స్ కీర్తి కూడా మెగాస్టార్ తో నటించాలనే కోరికతో ఈ ఆఫర్ ఒప్పుకుని ఉండొచ్చు.

కానీ కీర్తికి ఇప్పుడున్న ఈ క్రేజ్ దృష్ట్యా సినిమాలో ఆమె పాత్ర ఏమాత్రం వెయిట్ తగ్గినా భోళా శంకర్ రిస్క్ లో పడినట్టే అని చెప్పొచ్చు. కొంతమంది హీరోయిన్స్ వారికి ఉన్న క్రేజ్ కి అందుకు తగిన పాత్రలో నటించాలని ప్రేక్షకులు అభిప్రాయపడతారు.

ఈ క్రమంలో కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో సిస్టర్ రోల్ అని తెలిసినా ఆ పాత్రని చాలా తగ్గిస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద ఆధాపడుతుందని అంటున్నారు. అలా కాకుండా కీర్తిని పర్ఫెక్ట్ గా వాడుకుంటే మాత్రం ఆమె క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. దసరా హిట్ తో కీర్తి సూపర్ జోష్ లో ఉండగా నానితో ఆల్రెడీ నేను లోకల్ హిట్ కొట్టిన అమ్మడు దసరాతో ఈ కాంబో క్రేజ్ ని పెంచేసింది.