Begin typing your search above and press return to search.

ఆ బొమ్మలు కలిసి రావడం లేదా?

By:  Tupaki Desk   |   30 Nov 2016 5:30 PM GMT
ఆ బొమ్మలు కలిసి రావడం లేదా?
X
టాలీవుడ్ లో ఇప్పుడు హ్యాపెనింగ్ బ్యూటీ అంటే.. కీర్తి సురేష్ పేరే చెప్పాలి. వరుసగా స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ ఈమె పేరు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే మూవీ చేస్తున్నట్లు ఇప్పటికే కీర్తి అనౌన్స్ చేసేయగా.. మహేష్ బాబు-కొరటాల ప్రాజెక్ట్ లోను.. అల్లు అర్జున్-లింగుస్వామిలు రూపొందించే బై లింగ్యువల్ లోను కీర్తి సురేష్ పేరే వినిపిస్తోంది. అయితే.. ఇదంతా సంతోషం కలిగించే విషయమైనా.. అమ్మడిని దురదృష్టం కూడా వెంటాడుతూనే ఉంది.

నేను శైలజతో అరంగేట్రంలోనే అదిరిపోయే హిట్ కొట్టిన కీర్తిసురేష్ కి.. ఆ తర్వాత మాత్రం కలిసి రావడం లేదు. ధనుష్ తో కలిసి నటించిన తొడరి(తెలుగులో రైల్) డిజాస్టర్ గా నిలిచింది. కీర్తి వరుస హిట్స్ జోరుకు రైల్ బ్రేక్ వేస్తే.. ఇప్పుడు రెమో తెలుగు వెర్షన్ పరిస్థతి కూడా అలాగే ఉంది. తమిళ్ రెమో హిట్ గా నిలిచినా.. తెలుగులో మాత్రం పబ్లిసిటీ ఖర్చులు రాబట్టలేకపోయిందని అంటున్నారు.

తెలుగులో ఈ భామకు డబ్బింగ్ సినిమాలు అచ్చిరాలేదని అనుకుంటున్నారు అభిమానులు. అయితే.. నేనులోకల్ అంటూ నానితో కలిసి ఇదే ఏడాది వస్తుండడంతో.. హిట్ తో 2016ను ఫినిష్ చేయాలని చూస్తోంది కీర్తి సురేష్. స్టార్ హీరోయిన్ రేస్ లో పరుగులు పెడుతున్న కీర్తి ఇమేజ్ ని కాపాడే బాధ్యత.. ఇప్పుడు నానిపై పడిందన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/