Begin typing your search above and press return to search.

క‌న్ఫ‌మ్‌: ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స‌ర‌స‌న కీర్తి

By:  Tupaki Desk   |   16 Nov 2016 1:13 PM GMT
క‌న్ఫ‌మ్‌: ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ స‌ర‌స‌న కీర్తి
X
మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ దుమ్ము దులిపేస్తోంది. ఆమె వ‌రుస‌గా అవ‌కాశాల్ని సొంతం చేసుకొంటోంది. మ‌హేష్‌ బాబు స‌ర‌సన కథానాయిక‌గా ఎంపికైంద‌న్న విష‌యం గురించి జోరుగా మాట్లాడుకొంటున్న ద‌శ‌లోనే, ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ తో క‌లిసి న‌టించ‌బోతున్నాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించిందామె. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం మొద‌లైన విష‌యం తెలిసిందే. డిసెంబ‌రు నుంచి ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్ల‌బోతోంది. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిల‌కి చోటుంది. ఓ క‌థానాయిక‌గా కీర్తి ఎంపికైంది. మ‌రో కథానాయిక కోసం అన్వేష‌ణ జ‌రుపుతున్నారు. తాను ప‌వ‌న్‌ తో న‌టిస్తున్నాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించింది కీర్తి. టాలీవుడ్‌ లో ఆమెకి అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్ర‌స్తుతం నానితో క‌లిసి `నేను లోక‌ల్‌`లో న‌టిస్తున్న కీర్తి మ‌హేష్‌-కొర‌టాల సినిమాలోనూ ఎంపికైంద‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే ఆ సినిమా గురించి అటు కీర్తి గానీ - ఇటు చిత్ర‌బృందం గానీ స్పందించలేదు. ఇంత‌లో కీర్తి స్వ‌యంగా ప‌వ‌న్‌ తో న‌టిస్తున్నాన‌న్న విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ఈ దెబ్బ‌తో కీర్తి తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయిన‌ట్టే. స‌మంత‌ - అనుష్క‌ - కాజ‌ల్‌ లా ఇక కీర్తి హ‌వా మొద‌లుకాబోతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు మాట్లాడుకొంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/