Begin typing your search above and press return to search.

'మ‌హాన‌టి' ఏదో అయ్యింద‌మ్మా!

By:  Tupaki Desk   |   3 Jan 2020 10:43 AM IST
మ‌హాన‌టి ఏదో అయ్యింద‌మ్మా!
X
చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే. కానీ కొంత మంది విష‌యంలో అది ఎంత మాత్ర‌మూ నిజం కాద‌ని తేలిపోయింది. ఖుష్బూ ముద్దుగా బొద్దుగా వుంటేనే అందం.. న‌య‌న‌తార బొద్దుగా వున్న‌ప్పుడే ల‌వ్ లీగా క‌నిపించింది. కానీ ఆ త‌రువాత స్లిమ్ అయ్యేస‌రికి ఈ భామ‌ల‌ సహ‌జ అందం కోల్పోయిన‌ట్ట‌య్యింది. కీర్తి సురేష్ కూడా అంతే. బొద్దుగా ఉన్న‌ప్పుడే ఎంతో అందంగా క‌నిపించి ఆక‌ట్టుకుంది.

కానీ బాలీవుడ్ బాట ప‌ట్టిన ఈ `మ‌హాన‌టి` త‌న స‌హ‌జ‌సిద్ద‌మైన అందాన్ని కోల్నోయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఫుట్ బాల్ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ లైఫ్ స్టోరీ ఆధారంగా బాలీవుడ్ లో రూపొందుతున్న `మైదాన్‌`లో కీర్తి న‌టిస్తోంది. బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసమే బొద్దుగుమ్మ కాస్తా స‌డెన్ గా స్లిమ్ అయిపోయి పీల‌ గా మారి పోయింది. ఆక‌స్మిక ప‌రిణామం వ‌ల్ల మునుప‌టి గ్లో అమెలో క‌నిపించ‌డం లేదు.

స‌హ‌జంగా బొద్దుగా వుంటేనే మ‌రింత అందంగా.. ల‌వ్ లీగా.. చ‌బ్బీగా క‌వ్వించే కీర్తిలో ఇప్పుడు ఆ చ‌రిష్మా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల జాతీయ అవార్డు అందుకున్న అనంత‌రం రాష్ట్ర‌పతి ఇచ్చిన విందుకు వెళ్లే ముందు కీర్తి వైట్ డ్రెస్ లో దిగిన ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో క‌నిపిస్తున్న కీర్తిలో మునుప‌టి ఛ‌రిష్మా క‌నిపించ‌డం లేద‌ని.. ముద్దుగుమ్మ బొద్దు గా వుంటేనే అందమ‌ని నెటిజ‌నులు పెద‌వి విరిచేస్తున్నారు.