Begin typing your search above and press return to search.
తేజకి కీర్తి ఆ ఛాన్స్ ఇస్తుందా?
By: Tupaki Desk | 21 July 2020 10:45 AM ISTదర్శకుడు తేజ కొన్నాళ్ల క్రితం రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో మొదటగా అలివేలుమంగ వెంకటరమణ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. గోపీచంద్ ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర హీరోతో సమానమైన పాత్రను కలిగి ఉంటుంది. అందుకే హీరోయిన్ గా టాప్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడు. అందుకే కీర్తి సురేష్ ను ఈ చిత్రం కోసం ఆయన అనుకున్నాడు.
ఇటీవల దర్శకుడు తేజ కీర్తి సురేష్ ను కలవడం కథ చెప్పడం ఆమెను ఒప్పించడం జరిగిందంటూ టాక్ వినిపిస్తుంది. తేజ దర్శకత్వంలో నటించేందుకు కీర్తి సురేష్ ఓకే చెప్పిందనే వార్త ప్రస్తుతం పలు అనుమానాలకు తెర తీస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం కీర్తి సురేష్ కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియలోనే బిజీ హీరోయిన్. హిందీలో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో పాటు తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇలాంటి సమయంలో తేజ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకుంది అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.
ఎంత బిజీగా ఉన్నా కూడా కథ నచ్చితే పాత్ర ప్రాముఖ్యతను బట్టి ఛాలెంజింగ్ గా అనిపిస్తే కీర్తి సురేష్ ఆ సినిమాకు కమిట్ అయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మరి అసలు విషయం ఏంటీ అనేది కీర్తి సురేష్ కాని తేజ కాని నోరు తెరిస్తే తప్ప క్లారిటీ రాదు. కీర్తి సురేష్ హీరోయిన్ గా అలివేలుమంగ వెంకటరమణ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం స్థాయి పెరగడం ఖాయం.