Begin typing your search above and press return to search.

మన్మథుడితో మరో బ్యూటీ

By:  Tupaki Desk   |   5 Jun 2019 11:08 AM IST
మన్మథుడితో మరో బ్యూటీ
X
కింగ్ నాగార్జున కొత్త సినిమా మన్మథుడు 2 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అయినప్పటికీ చాలా అదనపు ఆకర్షణలు జోడించేస్తున్నారు. తాజాగా నేను శైలజ పోరి అదే మన మహానటి కీర్తి సురేష్ కూడా నాగ్ తో జట్టు కట్టేసింది. తన సీన్స్ షూట్ చేయడం కూడా పూర్తయిపోయింది.

ఈ సందర్భంగా వదిలిన స్టిల్స్ అప్పుడే వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ చేస్తోంది చిన్న క్యామియో. కథలో ఎలా సందర్భంలో వస్తుందో తెలియలేదు కానీ కీలకమైన మలుపుకు కారణమయ్యే తరహాలో ఉంటుందట. ఇప్పటికే కోడలు సమంతా ఇందులో సందడి చేసింది. ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. మహానటి తర్వాత తెలుగులో బొత్తిగా కనిపించడం మానేసి అన్ని ఆరవ హీరోలతో చేస్తున్న కీర్తి సురేష్ ఇప్పుడీ స్పెషల్ క్యామియో ద్వారా ఇకపై వరసగా నటిస్తాను అని సంకేతం ఇచ్చినట్టే అనుకోవాలి.

తను ఇలా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది సమంతా హీరోయిన్ గా నటించిన శివ కార్తికేయన్ సీమరాజాలో కీర్తి క్యామియో చేసింది. ఇప్పుడు మన్మథుడు 2 ఇద్దరూ కొద్దినిమిషాల పాటే కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా తాలూకు వర్కింగ్ స్టిల్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఇంకో పదేళ్లు వెనక్కు వెళ్లినట్టుగా ఉన్న నాగ్ లుక్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇలా వరసబెట్టి ముద్దుగుమ్మలను తీసుకొస్తూ ఉంటే మన్మథుడు 2 మీద బజ్ రావడానికి అంత కంటే ఏం కావాలి