Begin typing your search above and press return to search.

పవర్ కోసం వచ్చేసిన కీర్తి!!

By:  Tupaki Desk   |   5 April 2017 5:34 AM GMT
పవర్ కోసం వచ్చేసిన కీర్తి!!
X
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేసేయాలని ఫిక్స్ అయిన పవన్.. కాటమరాయుడు రిలీజ్ చేసిన వారానికే త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ చేసేశాడు. గతంలోనూ ముహూర్తం షాట్ పూర్తయిపోగా.. ఇప్పుడు హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన 5 కోట్ల రూపాయల భారీ ఇంటి సెట్ లో.. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేశారు.

షూటింగ్ మొదటి రోజునే ఒక హీరోయిన్ అను ఇమాన్యుయేల్ హాజరు కాగా.. ఇప్పుడు లీడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా పవర్ స్టార్ మూవీ షూటింగ్ కి వచ్చేసింది. 'నా కొత్త తెలుగు సినిమాను పవన్ కళ్యాణ్ సార్, త్రివిక్రమ్ సార్ తో ఇవాళ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ఆశీర్వాదాలు.. ఆదరణ కావాలి' అంటూ.. పవన్-త్రివిక్రమ్ ల మూవీలో జాయిన్ అయిన విషయాన్ని అఫీషియల్ గా చెప్పింది కీర్తి సురేష్.

మాటల మాంత్రికుడుతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీలో ఖుష్ బూ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/