Begin typing your search above and press return to search.

లోకల్ హీరోయిన్ లక్ బాగుందిలే

By:  Tupaki Desk   |   3 May 2017 7:45 AM GMT
లోకల్ హీరోయిన్ లక్ బాగుందిలే
X
'నేను శైలజ' సినిమాతో తెలుగులో సైలెంట్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ వైపు అడుగులు వేస్తున్న సుందరి కీర్తి సురేశ్. మలయాళం అమ్మాయి అయనా తెలుగులో జనాలు ఎలాగో ఇతర బాషల భామల కోసం ఎగబడతారు కాబట్టి.. ఇక్కడ బాగానే అవకాశాలు పట్టేసింది.

తెలుగులో అమ్మడు పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తమిళ్ హీరో సూర్య సినిమా కూడా చేస్తోంది. ఇక తెలుగువారికి గర్వకారణమైన సావిత్రి బయోపిక్ లో ఈమె సావిత్రి రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు మరో టాప్ తమిళ్ హీరోతో అమ్మడు ఛాన్సు కొట్టేసిందట. చియాన్ విక్రమ్ చేయబోతున్న సినిమా సామీ 2 లో కూడా అమ్మడు హీరోయిన్ గా నటించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను సింగమ్ ఫేం డైరెక్టర్ హరి చేయబోతున్నారు. సామీ 2 లో కీర్తి తో పాటు త్రిష కూడా నటిస్తోంది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కీర్తి.. ఇది పూర్తియైన తరువాత ఇంకా వరసపెట్టి సౌత్ లో షూటింగ్ వేగవంతంగా సినిమాలు చేసేస్తుందట. చివరగా ఇక్కడ 'నేను లోకల్' సినిమాలో కనిపించిందిలే. లక్ బాగుంటే అంతే గురూ.. ఆఫర్లు అలా వచ్చిపడుతూనే ఉంటాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/