Begin typing your search above and press return to search.

పవన్ కోసం కీర్తి పయనం!!

By:  Tupaki Desk   |   7 Nov 2017 8:28 AM GMT
పవన్ కోసం కీర్తి పయనం!!
X
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. పవర్ స్టార్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ ముూవీకి అజ్ఞాతవాసి అనే టైటిల్ ఖాయం చేశారనే టాక్ ఉంది కానీ.. ఇంకా తుది ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యూరోప్ లోని బల్గేరియాలో జరుగుతోంది. అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు అను ఇమాన్యుయేల్ ల మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు త్రివిక్రమ్. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సాంగ్స్ తో పాటు ఓ పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. ఇప్పుడు కీర్తి సురేష్ ఢిల్లీ నుంచి నేరుగా పవన్ కోసం యూరోప్ పయనం అయింది. ఇప్పటివరకూ మహానటి షూటింగ్ తో మహా బిజీగా ఉన్న కీర్తి సురేష్.. షెడ్యూల్ ప్రకారమే పవన్ మూవీలో యాక్ట్ చేసేందుకు బయల్దేరింది. యూరోప్ షెడ్యూల్ లో పవన్ -కీర్తిల మధ్య వచ్చే కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా పిక్చరైజ్ చేయనున్నారని తెలుస్తోంది.

యూరోప్ షెడ్యూల్ తో దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని.. మిగిలిన ప్యాచ్ వర్క్ ను హైద్రాబాద్ లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారం నాటికి మొత్తం షూటింగ్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడట పవర్ స్టార్.