Begin typing your search above and press return to search.

వీడియో: నితిన్ పై కీర్తి ఫ‌న్ రివెంజ్

By:  Tupaki Desk   |   18 March 2021 3:47 AM GMT
వీడియో: నితిన్ పై కీర్తి ఫ‌న్ రివెంజ్
X
నితిన్ - కీర్తి సురేష్ జంట‌గా నటించిన `రంగ్ దే` మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార అధినేత నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఆన్ లొకేష‌న్ ఫ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. కీర్తిని ఆట‌ప‌ట్టిస్తూ నితిన్ - వెంకీ బృందం ఓ వీడియోని రిలీజ్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. ఆ త‌ర్వాత నితిన్ .. వెంకీల‌పై కీర్తి ప‌గ ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఏదో ఒక‌టి చేస్తూనే ఉంది.

తాజాగా నితిన్ ని ఆట‌ప‌ట్టిస్తూ ఓ స‌ర‌దా వీడియోని షేర్ చేసింది కీర్తి. రంగ్ దే నుంచి ఒక ఇమేజ్ ని తీసుకుని దానిని యానిమేట్ చేసింది కీర్తి. నితిన్ హెడ్ అటూ ఇటూ క‌దులుతూ ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా’ పాటకు స్టెప్పేస్తోంది. యానిమేష‌న్ ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్ అవ్వ‌డంతో బోలెడంత ఫ‌న్ జ‌న‌రేట్ అవుతోంది. “హాయ్ అర్జున్.. ఇదిగో నా పగ ప్ర‌తీకారం… ప్రేమ..- అను” అంటూ రంగ్ దేలో వారి పాత్రల కెమిస్ట్రీని ఎలివేట్ చేశారు కీర్తి.

ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్‌ షూటింగ్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. దానికి కీర్తి యానిమేష‌న్ జోడించిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నితిన్ అభిమానుల్లోనూ వైర‌ల్ గా మారింది. రంగ్ దే ప్రీబినెస్ హైప్ బావుంది. ఈ చిత్రంపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈనెల‌ 19న కర్నూలులో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో మేకర్స్ హైప్ ను మరింత పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. DSP ఈ చిత్రానికి సంగీతం అందించారు.