Begin typing your search above and press return to search.

కీర్తి ఏ షూటింగులో పడిపోయిందబ్బా

By:  Tupaki Desk   |   9 Nov 2017 11:30 PM GMT
కీర్తి ఏ షూటింగులో పడిపోయిందబ్బా
X
మలయాళీ భామ కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ లో జెండా బాగానే పాతేసింది. మహానటి లాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో పాటు.. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టులో కూడా యాక్ట్ చేసేస్తోంది. అజ్ఞాతవాసి అనే టైటిల్ ఖాయం చేస్తారనే అంచనాలు ఉన్న ఈ చిత్రం షూటింగ్ కోసం.. రీసెంట్ గా యూరోప్ వెళ్లిన ఈ భామ.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం పవన్ టీం అంతా బల్గేరియాలో షూటింగ్ జరుపుతున్నారు. అయితే.. తాజాగా షూటింగ్ స్పాట్ లో కీర్తి సురేష్ డ్యాన్స్ చేస్తూ పడిపోయిన వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వాటర్ ఫాల్స్ కు దగ్గరలో రాళ్ల పై డ్యాన్స్ స్టెప్ వేసేందుకు ప్రయత్నించిన కీర్తి.. నీటిలో అడుగు వేసి జర్రున జారిపోయింది. ఆమె పడిపోయిన విధానాన్ని స్లో మోషన్ లో చూస్తే.. ఒళ్లంతా అదిరిపోయి గట్టిగానే దెబ్బలు తగిలాయనే సంగతి అర్ధమవుతుంది. కీర్తికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ లో చాలానే ప్రాక్టీస్ ఉంది కాబట్టి.. డ్యాన్స్ చేయలేక పడిపోయిందని అనుకోలేం. అది స్పాట్ లో అనుకోకుండా జరిగిన ప్రమాదం.

ఇంతకీ ఇది ఏ సినిమా షూటింగ్ అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు. బల్గేరియాలో పవన్ సినిమా షూట్ లో పడిపోయిందా.. లేక గతంలో వేరే ఏ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదమా అన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ కీర్తి కాలు జారి పడిపోయిన ఈ వీడియో మాత్రం ఇప్పుడు బాగా వైరల్ అయిపోతోంది.