Begin typing your search above and press return to search.

ఆమెకు సంక్రాంతి సెంటిమెంట్ అవుతుంద‌ట‌

By:  Tupaki Desk   |   26 Nov 2017 4:06 PM GMT
ఆమెకు సంక్రాంతి సెంటిమెంట్ అవుతుంద‌ట‌
X
సంక్రాంతి పండ‌గ అంటే... ఇద్ద‌రికి వెరీ వెరీ స్పెష‌ల్‌. ఒక‌టి... గోదావ‌రి కోడి పందెం రాయుళ్ల‌కు, రెండు.. తెలుగు సినిమా స్టార్ల‌కు. త‌మాషా కాదు... హ్యాపీ హ్యాపీ ఫెస్టివ‌ల్ అది. కాద‌ని ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా? నో నో నో! గ‌త సంక్రాంతికి నాలుగు సినిమాలొస్తే దాదాపు నాలుగు హిట్లే. వాటిలో ఒక‌టి నేను శైల‌జ‌. ఇపుడు కొత్త‌ సంక్రాంతికి ఆ శైల‌జ మ‌ళ్లీ వ‌స్తోంది. పైగా స్టార్ కాంబినేష‌ను... త్రివిక్ర‌మ్‌-ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ కాంబినేష‌న్ అంటే ఎంత క్రేజో అంద‌రికీ తెలిసిందే. అలాంటి మ‌హా క్రేజున్న ప్రాజెక్టులో.. మ‌న శైల‌జ అదేనండీ, కీర్తి సురేష్ కనిపించ‌నుంది. ఇప్ప‌టికే వ‌రుస హిట్లు కొట్టేసిన ఈ భామ వాల‌కం చూస్తుంటే ఈ సారి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ త‌న జాబితాలో వేసుకుంటుందేమో అంటున్నారు.

తాజాగా ఈమె గురించి ఇంకో విశేషం ఉందండోయ్‌... ఇప్ప‌టి వ‌ర‌కు అద్దె గొంతుతో వ‌చ్చింద‌ట‌. నా చ‌క్క‌టి మొహ‌మే కాదు... నా తియ్య‌టి గొంతునూ మీతో షేర్ చేసుకుంటున్నా అంటూ త‌న ట్విట్ట‌రులో వెల్ల‌డించింది. ఈ భారీ ప్రాజెక్టుతో తెలుగులో సొంత స్వ‌రం అరంగేట్రం జ‌ర‌గ‌డం ... శుభ శ‌కునంగా భావిస్తోందావిడ‌.

ఇవ‌న్నీ చూస్తుంటే... ఈమె సంక్రాంతి సెంటిమెంటును త‌న లిస్టులో వేసుకునేట‌ట్టే ఉందే అంటున్నారు. ఈ సినిమా భారీ హిట్ కొడితే కీర్తి సురేష్ ను పెట్టుకుంటే సంక్రాంతి హిట్ గ్యారంటీ అనే సెంటిమెంటు ముద్ర క‌చ్చితంగా ప‌డుతుందంటున్నారు ఆమె అభిమానులు. ఇంత‌కీ ఆమె ట్విట్ట‌రులో ఏమందంటే.... నేను తొలిసారిగా తెలుగులో డ‌బ్బింగ్ చెప్పాను. మొత్తం అయిపోయింది. ఇపుడు నేను కంప్లీట్ యాక్ట‌ర్ ను అంటోంది. అలాగే బంగారం.... టాలీవుడ్ ను దున్నేసెయ్‌!