Begin typing your search above and press return to search.

మహేష్ తో నటిస్తున్నానని కంఫర్మ్ చేసిన మలయాళ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   18 Jun 2020 3:42 PM GMT
మహేష్ తో నటిస్తున్నానని కంఫర్మ్ చేసిన మలయాళ బ్యూటీ...!
X
'మహానటి' కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించబోతున్నట్లు కంఫర్మ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఫాలోవర్స్ తో ముచ్చటించిన కీర్తి సురేష్ 'సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ సరసన యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా మలయాళ కుట్టి కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ తో జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ.. అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇప్పుడు కీర్తి దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. నిజానికి ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి హీరోయిన్ విషయంలో రోజుకొక న్యూస్ వస్తూనే ఉంది. ముందుగా'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ కి జోడీగా నటించిన కియార అద్వానీ మళ్ళీ జత కట్టబోతోందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'మహర్షి' సినిమాలో నటించిన పూజాహెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ సైఈ మంజ్రేకర్ సూపర్ స్టార్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. చివరికి కీర్తి సురేష్ నే ఫైనలైజ్ చేశారని.. మహేష్ బాబుతో నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే నిజమని ఇప్పుడు తేలిపోయింది.

కాగా కీర్తి సురేష్ 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే స్టార్ హీరోల పక్కన పెద్దగా నటించింది లేదు. కేవలం పవన్ కళ్యాణ్ సరసన 'అజ్ఞాతవాసి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆ తర్వాత అమ్మడు మరో స్టార్ హీరో పక్కన కనిపించలేదు. కానీ ఇతర ఇండస్త్రీలలో మాత్రం స్టార్ హీరోల సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగులో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న 'మిస్ ఇండియా' 'గుడ్ లక్ సఖీ' 'రంగ్ దే' సినిమాలు ఆ కోవకు చెందినవే. దీంతో ఇక తెలుగులో స్టార్ హీరోలతో నటించడానికి ఆసక్తి చూపించడం లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఓకే చేసి ఆ వార్తలకు చెక్ పెట్టింది. ఈ సినిమా మహానటి కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'పెంగ్విన్' సినిమా ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమైంది. తెలుగు మలయాళ తమిళ హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకి రానుంది.