Begin typing your search above and press return to search.

కీర్తి ఆయన్ని గాడ్ ఫాదర్ అనేసింది

By:  Tupaki Desk   |   13 May 2018 3:52 AM GMT
కీర్తి ఆయన్ని గాడ్ ఫాదర్ అనేసింది
X
హీరొయిన్ కీర్తి సురేష్ ప్రస్థానం మహానటికి ముందు మహానటికి తర్వాత అన్నట్టు మారిపోయింది. నిన్నా మొన్నటి దాకా గ్లామర్ పాత్రలకు కట్టుబడి హీరోల పక్కన డ్యూయెట్లకు లవ్ ట్రాక్స్ కు మాత్రమే పరిమితమైన కీర్తి సురేష్ లోని పూర్తి టాలెంట్ ని మహానటి బయటి ప్రపంచానికి చూపించేసింది. ఈ సినిమా తాలూకు ప్రభావం తనని కొంత కాలం వెంటాడినా ఆశ్చర్యం లేదు. వారు వీరు అనే తేడా లేకుండా అన్ని వర్గాల నుంచి దీనికి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం యూనిట్ లో జోష్ నింపుతోంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి స్వయానా సన్మానం చేసి మరీ మహానటి గురించి గొప్పగా చెప్పడం చూసాం. ఇప్పుడు ఈ వరసలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కూడా తోడయ్యారు. ట్విట్టర్ లో మహానటి గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా గురించి గొప్ప రివ్యూలు చూస్తున్నానని తమ సినిమా కుటుంబంలోని ఇద్దరు ఇంత ఘన కీర్తిని సంపాదించుకోవడం గర్వంగా ఉందని చెబుతూ త్వరలోనే సినిమా చూస్తానని ప్రకటించాడు.

ఇంత పెద్దాయన అందులోనూ మలయాళం సూపర్ స్టార్ అంత కాంప్లిమెంట్ ఇచ్చాక కీర్తి సురేష్-దుల్కర్ సల్మాన్ ఆనందం గురించి చెప్పేదేముంటుంది. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. దుల్కర్ సల్మాన్ థాంక్స్ చెబుతూ లలెట్టన్(మోహన్ లాల్ కు అభిమానుల ముద్దు పేరు)అని సంభోదించగా కీర్తి సురేష్ మాత్రం ఆయన్ను ఏకంగా గాడ్ ఫాదర్ అనేసింది. మొత్తానికి ముగ్గురి మధ్య సంభాషణ ట్విట్టర్ వేదికగా చాలా ఆసక్తికరంగా సాగింది. మలయాళంలో కూడా మహానటి ప్రభంజనం కొనసాగుతోంది. కేరళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు అందులోనూ తనకంటూ స్వంత స్టార్ డం ఏర్పరుచుకున్న దుల్కర్ సల్మాన్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో అక్కడ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళ్ కు ధీటుగా మలయాళంలో కూడా స్పందన దక్కడం పట్ల వైజయంతి సంస్థ ఆనందంగా ఉంది. వీక్ ఎండ్ మొత్తాన్ని కబళించిన మహానటి మేనియాకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. రాబోయే శుక్రవారం ప్లాన్ చేసిన రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ కావడం మహానటికి అతి పెద్ద ప్లస్ గా మారబోతోంది.