Begin typing your search above and press return to search.

పెళ్లి వార్త.. మహానటి ఈసారి ఏమందంటే?

By:  Tupaki Desk   |   21 April 2023 3:08 PM IST
పెళ్లి వార్త.. మహానటి ఈసారి ఏమందంటే?
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో నటించి మెప్పించారు. మహానటి మూవీ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకుల నుంచి మరోసారి ప్రశంసలు అందుకున్నారు.

తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో కీర్తి సురేష్ తాను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కీర్తి సురేష్ మీద రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. స్టార్టింగ్ లో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ఆమె డేటింగ్ చేస్తుంది అంటూ పుకార్లు షికారు చేశాయి.

వీటిపై క్లారిటీ ఇచ్చిన కొంతకాలం తర్వాత మరల ఆమె పెళ్లికి రెడీ అవుతుందని టాక్ వినిపించింది. కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయమైందని విస్తృత ప్రచారం నడిచింది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఆమె పెళ్లి ఖాయం చేశారంటూ జోరుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తర్వాత తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ కీర్తి సురేష్ తో డేట్ చేస్తున్నారు అంటూ ప్రచారం నడిచింది. కీర్తి సురేష్ కోసం విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పెళ్లి వార్తలపై జరుగుతున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒక అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని కీర్తి సురేష్ ని ప్రశ్నించారు.

తనకి సరిపోయే కరెక్ట్ అబ్బాయి ఇంకా దొరకలేదని, దొరికినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటానని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ తో ఆమె తనపై జరుగుతున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పాలి. మొత్తానికి కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వడంతో ఇకనైనా ఆమెపై ఈ రకమైన ప్రచారం ఆగుతోందా లేదా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సెరిన్ లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.