Begin typing your search above and press return to search.

మ్యారేజ్ పై కీర్తి వెరైటీ కామెంట్..!

By:  Tupaki Desk   |   20 April 2023 2:00 PM
మ్యారేజ్ పై కీర్తి వెరైటీ కామెంట్..!
X
మలయాళ భామ కీర్తి సురేష్ మహానటితో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ కు సరైన సినిమా పడలేదు. రీసెంట్ గా వచ్చిన దసరా సినిమాలో వెన్నెల పాత్రతో కీర్తి ఆకలి కొంత తీరిందని చెప్పాలి. అయినా సరే మన మేకర్స్ కీర్తి సురేష్ కు తగిన పాత్ర ఇవ్వట్లేదు అన్న టాక్ అయితే ఉంది. తనకు వచ్చిన ఛాన్స్ లతోనే కీర్తి సురేష్ తన నటనతో అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. కెరీర్ మొదట్లో గ్లామర్ విషయంలో కాస్త ఆలోచించిన అమ్మడు ఈమధ్య గ్లామర్ రోల్స్ కూడా సై అనేస్తుంది.

ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో తన అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తుంది కీర్తి సురేష్. అంతేకాదు అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చాటింగ్ కూడా చేస్తుంది. రీసెంట్ గా కీర్తి సురేష్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది.

ఈ క్రమంలో కీర్తి సురేష్ పెళ్లిపై ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. దానికి కీర్తి సురేష్ వెరైటీగా ఆన్సర్ ఇచ్చింది. మీ పెళ్లెప్పుడు అని అడిగితే వడివేలు కార్టూన్ అది కూడా రెండు జేబుల్లో ఏముంది..? ఏమి లేదు అన్నది పెట్టింది. సో పెళ్లి గురించి ఇప్పుడప్పుడే ఆలోచించడం లేదని చెప్పేసింది.

కీర్తి సురేష్ పెళ్లిపై మీడియాలో ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. బిజినెస్ మెన్ తో కీర్తి పెళ్లంటూ ప్రతిసారీ వార్తలు వస్తుంటాయి. అయితే అవన్ని వట్టి గాలి వార్తలే అని ఆమె ఆన్సర్ తో తేల్చి చెప్పినట్టు అయ్యింది.

ఇక ప్రస్తుతం తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ తో ఒక సినిమా జయం రవికి జోడీగా మరో సినిమా చేస్తుంది కీర్తి సురేష్. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా కీర్తి సురేష్ కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది అమ్మడు.

స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ వాటికన్నా తన పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తేనే బెటర్ అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. అయితే హీరోయిన్ అన్న తర్వాత అన్ని సినిమాలు చేయాలి కాబట్టి కీర్తి ఎంపిక కరెక్ట్ అని చెప్పొచ్చు. తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్.