Begin typing your search above and press return to search.

కుక్కపిల్లతో ట్రెండింగ్ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి!

By:  Tupaki Desk   |   22 Nov 2021 1:30 AM GMT
కుక్కపిల్లతో ట్రెండింగ్ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్న కీర్తి!
X
తమ అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే చాలామంది హీరోయిన్లలో, కుక్కపిల్లలను ఇష్టపడటమనే అలవాటు కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. కుక్కపిల్లలను ఒకటి మించి పెంచుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కుక్కపిల్లలను రకరకాలుగా ముద్దు చేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వాటిని అనేక రకాలుగా అలంకరించి ముద్దు చేస్తూ మురిసిపోతుంటారు. వాటి పట్ల తమకి గల ప్రేమను అలా వ్యక్తం చేస్తుంటారు. ఆ ఫోటోలను చూసి నవ్వుకునే వాళ్లు కొందరైతే, వాళ్లకి గల జంతు ప్రేమను అభినందించేవాళ్లు మరి కొందరు.

అలాగే తాజాగా కీర్తి సురేశ్ తన పెంపుడు కుక్కపిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఒక ట్రెండింగ్ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పాట ఏ సినిమాలోదంటే .. 'ఎనిమి ' సినిమాలోనిది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్ - ఆర్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఎనిమి' సినిమా లోనిది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. విశాల్ - మృణాళిని రవి బృందంపై చిత్రీకరించిన 'టమ్ టమ్' అనే సాంగ్ బాగా పాప్యులర్ అయింది.

తమిళంలో ఈ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పుడు ఆ పాట అక్కడి యూత్ ను ఒక ఊపు ఊపేస్తోంది. కుక్కపిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని చేతులను .. కాళ్లను లయబద్ధంగా కదిలిస్తూ .. మధ్య మధ్యలో ఆ కుక్కపిల్లను చూసి మురిసిపోతూ కీర్తి ఆ పాటను ఎంజాయ్ చేస్తోంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ డ్రెస్ లో ఆమె చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. ప్రశాంతమైన ప్రదేశంలో ఆమె అలా ఎంజాయ్ చేస్తూ నవ్వడం అభిమానుల మనసులను దోచేసుకుంటోంది. షూటింగులు .. షాపింగులు లేనప్పుడు కీర్తి ఇలా తన కుక్కపిల్లతో సరదాగా సందడి చేస్తుందనే విషయం మాత్రం అర్థమైపోతోంది.

ప్రస్తుతం కీర్తి సురేశ్ తెలుగులో 'సర్కారువారి పాట' సినిమా చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. దాంతో ఆమె చిరంజీవితో 'భోళా శంకర్' సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. తమిళంలో 'సానికాయిధం' చేస్తున్న ఆమె, మలయాళంలో మోహన్ లాల్ తో 'మరక్కార్' చేసింది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకి రెడీ అవుతున్నాయి. ఇక తెలుగులో ఒకటి రెండు భారీ ప్రాజెక్టులలో కథానాయికగా ఆమె పేరు వినిపిస్తోంది. ఆ సినిమాల విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది.