Begin typing your search above and press return to search.

మురారి వా... కీర్తి సురేష్ హద్దులు చెరిపేసింది

By:  Tupaki Desk   |   3 Jun 2022 6:30 AM GMT
మురారి వా... కీర్తి సురేష్ హద్దులు చెరిపేసింది
X
మహేష్‌ బాబు సర్కారు వారి పాట థియేటర్‌ రన్‌ క్లోజ్‌ అయ్యే టైమ్‌ కు మురారి వా.. పాటను అటాచ్ చేయడం జరిగింది. సినిమా విడుదలకు ముందే మురారి వా అనే పాట ఉంది.. లెంగ్త్‌ ఎక్కువ అవ్వడం వల్ల తొలగించాం కాని ఖచ్చితంగా ఆ పాటను మీ ముందుకు తీసుకు వస్తాం అంటూ యూనిట్‌ సభ్యులు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగానే థియేటర్‌ లోనే మురారి వా.. పాటను స్క్రీనింగ్‌ చేస్తున్నారు.

కొందరు మహేష్ ఫ్యాన్స్‌ తో పాటు కొందరు కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఆ పాట కోసం మళ్లీ థియేటర్‌ కు వెళ్తున్నారు. మురారి వా పాటకు ఉన్న హైప్‌ నేపథ్యంలో ఎంతో కొంత కలెక్షన్ అయితే మళ్లీ పెరిగాయి అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఒక వారం పాటు కొద్ది మొత్తంలో అయినా వసూళ్లు నమోదు కావడంలో ఆ పాట ఖచ్చితంగా పని చేస్తుంది. ఇక ఆ పాట విషయానికి వస్తే పూర్తిగా కీర్తి సురేష్‌ డామినేట్‌ చేసినట్లుగా ఉంది.

మహేష్‌ బాబు డాన్స్ స్టెప్పులు.. ఇతర విషయాలన్నింటిని కూడా కీర్తి సురేష్ గ్లామర్‌ షో డామినేట్‌ చేసే విధంగా ఉందంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కీర్తి సురేష్ ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్స్‌ పోజింగ్ సన్నివేశాలు.. పాటలు చేసింది లేదు. మొదటి సారి ఈ సినిమా కోసం తన పరిధి దాటి మరీ అందాల ఆరబోత చేసింది. ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఈ సినిమా తో తనకు తాను పెట్టుకున్న హద్దులను చెరిపేసినట్లుగా కాస్ట్యూమ్స్ ను ధరించింది.

గతంలో నడుము అందాన్ని చూపించేందుకు కూడా ఆసక్తి చూపించని కీర్తి సురేష్ ఇప్పుడు నడుము నాభి అందంతో పాటు కొద్ది మొత్తంలో థైస్ ను కూడా ఎక్స్ పోజ్ చేస్తూ కమర్షియల్‌ హీరోయిన్ గా తనను తాను ప్రొజెక్ట్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్‌ గా కీర్తి సురేష్ ఇక నుండి మడి కట్టుకుని ఉన్న పాత్రలు కాకుండా కాస్త హాట్‌ గా ఉండే.. ఎక్స్ పోజింగ్ కు అవకాశం ఉండే సినిమాలు కూడా చేయబోతుందని దీన్ని బట్టి అర్థం అవుతోంది.

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌ ను ఎప్పుడు అలాంటి పాత్రల్లోనే చూడాలని ప్రేక్షకులు భావించారు. ఆమె కూడా అలాంటి పాత్రలనే చేసింది. కాని వాటిల్లో ఎక్కువ శాతం విఫలం అయ్యింది. అందుకే ఇక నుండి రెగ్యులర్ కమర్షియల్‌ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేట్లుగా ఎక్స్‌ పోజింగ్‌ కు సర్కారు వారి పాట సినిమా తో హద్దులు చెరిపేసినట్లుగా తెలుస్తోంది.

ఈమద్య కాలంలో సర్కారు వారి పాట తప్ప కీర్తి సురేష్ కు పెద్దగా సక్సెస్ లు దక్కలేదు. తమిళంలో కూడా ఒకటి అర సినిమాలు మాత్రమే ఆమెకు సక్సెస్ ను తెచ్చి పెట్టాయి. దాంతో తన అందాల ఆరబోత తప్పదనే విషయాన్ని గుర్తించి ఎక్స్ పోజింగ్‌ కు సిద్దం అయ్యింది. అదే మమ మహేష.. మరియు మురారి వా.. పాటల్లో చేసి చూపించింది. ముందు ముందు కూడా శృతి మించకుండా.. ఎబెట్టుగా లేకుండా ఒక మోస్తరు వరకు కీర్తి సురేష్ అందాల విందు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.