Begin typing your search above and press return to search.

కీర్తి అందుకోసం ఆగలేకపోతోందట

By:  Tupaki Desk   |   16 Feb 2016 3:30 PM GMT
కీర్తి అందుకోసం ఆగలేకపోతోందట
X
ఇప్పుడు కొత్తగా వస్తున్న భామల్లో సూపర్ స్పీడ్ మీదున్న సుందరాంగి ఎవరంటే.. మలయాళ కుట్టి కీర్తి సురేష్ పేరే చెప్పాలి. ఓ సినిమా హిట్ అయితే.. పక్క భాష నుంచి అవకాశాలు రావడం, ఆఫర్ల మీద ఆఫర్లు తలుపు తట్టడం పెద్ద విశేషం కాదు కానీ.. ఇలాంటి అవకాశం ఓ టాప్ స్టార్ నుంచి రావడం మాత్రం ఖచ్చితంగా ఆనందాన్నిచ్చేదే. ఇప్పుడదే ఆనందాన్ని అందరితో పంచుకుంటోంది కీర్తి సురేష్.

ఓ అవకాశం తన చేతికి వచ్చినందుకు ఎంతగా సంతోషిస్తోందో చెప్పడానికి కీర్తి చేసిన ఒక్క ట్వీట్ చాలు. 'యస్.. విజయ్60లో సంతకం పెట్టేశా. ఇళయ దళపతి విజయ్ సార్ తో జత కట్టినందుకు చాలాచాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్స్. ఈ మూవీ స్టార్టింగ్ కోసం వెయిట్ చేయలేను' అంటూ తన హ్యాపీనెస్ ని అందరితోను పంచుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం తెరి ని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ఈ కోలీవుడ్ పవర్ స్టార్.. ఏప్రిల్ లో కొత్త మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. భరతన్ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ చిత్రంలో.. మొదట కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు కానీ... చివరకు ఆ అవకాశం మలయాళ కుట్టి కీర్తి సురేష్ కి ద్గగింది.

సిటీ, విలేజ్ బ్యాక్ డ్రాప్ లలో రూపొందే ఈ మూవీలో.. కీర్తి సురేష్ పాత్ర చాలా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే మలయాళం, తెలుగులో పాగా వేసిన ఈ పాప.. ఇప్పుడు విజయ్ తో మూవీ సైన్ చేయడంతో.. కోలీవుడ్ లోనూ జెండా పాతేసే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.