Begin typing your search above and press return to search.

కాంట్రవర్సీ చెయ్యకుండా తప్పించుకుంది

By:  Tupaki Desk   |   17 Aug 2017 12:14 PM IST
కాంట్రవర్సీ చెయ్యకుండా తప్పించుకుంది
X
సాధారణంగా హీరోయిన్స్ ఇతర హీరోయిన్ల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోరు. ముఖ్యంగా మీడియా సమావేశాల్లో అయితే ఎంత సైలెంట్ గా ఉంటె అంత మంచిదని ఎక్కువగా మాట్లాడరు. అయినా సరే కొన్ని మీడియా చానెళ్లు రూమర్స్ వస్తున్నాయంటూ.. సెలబ్రెటీలను కొన్ని ప్రశ్నలను అడిగి షాక్ కి గురి చేస్తారు. ఆ ప్రశ్నలకు కొంత మంది వారి స్థాయి మేరకు సమాధానాలను ఇస్తే మరి కొంత మంది మెల్లగా జారుకునే ప్రయత్నం చేస్తారు. అదే అనుభవాన్ని రీసెంట్ గా సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కి ఎదురైంది.

గత కొంత కాలంగా తమిళ దర్శకుడు విగ్నేష్ తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న హీరోయిన్ నయనతార పై ఇప్పటివరకు అనేక రూమర్లు వెలువడుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా మీడియా ఆమెను అదే ప్రశ్నలను అడిగే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఆమె ఏ మీడియా సమావేశాల్లోనూ అలాగే సినిమా ప్రమోషన్స్ లోను అంతగా పాల్గొనదు అయితే రీసెంట్ గా ఆమెను అడగాల్సిన ప్రశ్నను కీర్తి సురేష్ ని అడిగేశారట కొందరు విలేకరులు. విగ్నేష్ దర్శకత్వంలో సూర్యా హీరోగా "తానా సెర్న్ద్ర కూటం" అనే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే రీసెంట్ చిత్రం యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు నయనతార-విగ్నేష్ ప్రేమ వ్యవహారం గురించి కీర్తి దగ్గర ప్రస్తావించడంతో ఆమె మెల్లగా నో కామెంట్స్ అంటూ.. అలాంటిది ఏమి లేదని మెల్లగా జారుకుందట. కానీ నయనతార తాను పీకల్లోతు ప్రేమలో ఉన్నానని చెబుతోందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ వాళ్లకి పెళ్ళి కూడా అయ్యిందని టాక్. మరి ఇలాంటి వ్యవహారానికి కీర్తి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తెలివిగా తప్పించుకుందని కామెంట్స్ వినబడుతున్నాయి.