Begin typing your search above and press return to search.

మణిరత్నం సినిమానే వద్దు పొమ్మంది

By:  Tupaki Desk   |   25 Oct 2015 4:15 AM GMT
మణిరత్నం సినిమానే వద్దు పొమ్మంది
X
మణిరత్నంతో సమస్య అదే. సినిమా ఓకే అవుతుంది కానీ.. ఓ పట్టాన మొదలవదు. నటీనటుల ఎంపిక దగ్గర్నుంచి మిగతా ప్రి ప్రొడక్షన్ పనుల కోసం చాలా టైం తీసుకుంటాడు ఈ లెజెండరీ డైరెక్టర్. దీంతో నెలలు నెలలు గడిచిపోతాయి. మణిరత్నంతో సినిమా అంటే లైఫ్ టైం ఛాన్స్ కాబట్టి కొందరు నటీనటులు సర్దుకుపోతారు కానీ.. అందరికీ డేట్లు సర్దుబాటు చేయడం కుదరదు. ఇలా మణి సినిమాల నుంచి తప్పుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా మణి చేయాలనుకుంటున్న ‘కోమలి’ సినిమా నుంచి కూడా హీరోయిన్ కీర్తి సురేష్ ఇలాంటి ఇబ్బందితోనే తప్పుకుంది.

తమిళ - మలయాళ భాషల్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ నాలుగు నెలల కిందట మణిరత్నం సినిమాకు ఎంపికైంది. అప్పట్లో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. అడగ్గానే డేట్లు కూడా ఇచ్చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల మణి అనుకున్న సమయానికి సినిమా మొదలు పెట్టలేదు. దీంతో కీర్తికి డేట్ల విషయంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ‘‘మణిరత్నం సినిమాలో చేయాలని ఎవరు కోరుకోరు. నేను కూడా చాలా సంతోషించా. కానీ సినిమా అనుకున్న సమయానికి మొదలు కాకపోవడంతో డేట్ల విషయంలో ఇబ్బంది ఎదురైంది. ఇప్పటికే వేరే సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చాను. అందుకే తప్పుకోక తప్పట్లేదు’’ అని చెప్పింది కీర్తి.