Begin typing your search above and press return to search.

ఏ హీరోతో చేస్తే అతనే ఫేవరేట్‌

By:  Tupaki Desk   |   24 Dec 2015 1:30 PM GMT
ఏ హీరోతో చేస్తే అతనే ఫేవరేట్‌
X
మీరు ఏ హీరోకి ఫేవ‌రెట్‌? ఇదో ప‌ర‌మ రొటీన్ క్వ‌శ్చ‌న్‌. ముంబై నుంచో - బెంగ‌ళూరు నుంచో - ఢిల్లీ - కోల్‌ క‌త లేదా మ‌ద్రాసు నుంచో హీరోయిన్‌ లు తెలుగులో ప‌రిచ‌యం అయ్యేప్పుడు జ‌ర్న‌లిస్టులంతా వేసే అరిగిపోయిన క్యాసెట్టు లాంటి ప్ర‌శ్న ఇది. ఇదే ప్ర‌శ్న టాలీవుడ్ లేటెస్ట్ సంచ‌ల‌నం కీర్తి సురేష్‌ ని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? ఏమాత్రం త‌డుము కోకుండా .. నేను రామ్ వీరాభిమానిని అని చెప్పింది.

ఏ క‌థానాయిక‌ను ప్ర‌శ్నించినా ముందుగా మ‌హేష్‌ కి ఫేవ‌రెట్‌ ని అనే అనేస్తుంటారు. మీరు కూడా అంతేనా? అని అడిగితే ఓ ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ ఇచ్చింది కీర్తి. అలాంటిదేం లేదండీ. నేను ఈ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్ట‌క ముందు నుంచి మ‌హేష్‌ కి ఫ్యాన్‌ ని. అంతేకాదు నేను ఏ హీరోతో న‌టించ‌డం మొద‌లుపెట్టినా ఆ హీరోకి ఫ్యాన్‌ ని అయిపోతా. ప్ర‌స్తుతం నేను - శైల‌జ మూవీలో రామ్ స‌ర‌స‌న న‌టించాను. అందుకే రామ్‌ కి అభిమానిగా మారిపోయాను.. అని చెప్పింది.

ఈ అమ్మ‌డు న‌టిస్తోంది రెండో సినిమానే. మొద‌టిది సీనియ‌ర్ న‌రేష్ కొడుకు న‌వీన్ స‌ర‌స‌న అయినా ఇష్టం నువ్వు అనే సినిమాలో న‌టించింది. ఇప్పుడు నేను - శైల‌జ రెండో సినిమా. ఇటీవ‌లే టీజ‌ర్ రిలీజైంది. ఇందులో కీర్తి హావ‌భావాలు కుర్ర‌కారుకు పిచ్చిగా న‌చ్చేశాయి. ఈ భామ‌కి టాలీవుడ్‌ లో బోలెడంత భ‌విష్య‌త్ ఉంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.