Begin typing your search above and press return to search.

కీర్తి అప్పుడే ఆ స్థాయికి ఎదిగిపోయిందా..

By:  Tupaki Desk   |   20 March 2016 11:30 AM GMT
కీర్తి అప్పుడే ఆ స్థాయికి ఎదిగిపోయిందా..
X
కీర్తి సురేష్.. కొన్ని రోజులుగా అటు కోలీవుడ్లో, ఇటు టాలీవుడ్లో మార్మోగిపోతున్న పేరు. తెలుగులో ‘నేను శైలజ’తో.. తమిళంలో ‘రజినీ మురుగన్’తో.. కొన్ని రోజుల వ్యవధిలో సూపర్ హిట్లు కొట్టింది ఈ మలయాళ భామ. ఈ రెండు హిట్ల తర్వాత ఆమెకు వరుసబెట్టి అవకాశాలు వచ్చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. చాలామంది స్టార్ హీరోలతో కలిపి ఆమె పేరును కలిపి కొన్ని సినిమాలు తెరమీదికి వచ్చాయి. కానీ అవేవీ కూడా కార్యరూపం దాల్చట్లేదు. తెలుగులో మహేష్ బాబు - రామ్ చరణ్ లతో కలిసి నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది.

మరోవైపు తమిళంలో కూడా కీర్తి ఫలానా సినిమాలో నటిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాలన్నీ ఉత్త గ్యాస్ అని వెల్లడైంది. విజయ్ సరసన ఓ సినిమా చేస్తుందన్నారు అది నిజం కాదు. విక్రమ్ తో అనుకున్న సినిమా పరిస్థితి కూడా అంతే. ‘గరుడ’ పేరుతో తెరకెక్కబోతున్న ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ ను ఫైనలైజ్ చేశారు. ఐతే కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాకు ముందు కీర్తినే అడిగారని.. కానీ ఆమే ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని అంటున్నారు. ఐతే విక్రమ్ సినిమాకే నో అనేంత సీన్ కీర్తికి ఉందా.. ఆమె ఆ రేంజికి ఎదిగిపోయిందా అని సెటైర్లు వేస్తున్నారు తమిళ జనాలు. ఈ మధ్య కాలంలో ఓ హీరోయిన్ కు సంబంధించి.. రకరకాల ప్రాజెక్టులు తెరమీదికి వచ్చి.. ఆ సినిమాలు వేటిలోనూ ఆమె నటించకపోవడం అన్నది ఇంకెవ్వరి విషయంలోనూ జరగలేదు.