Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కి `నో` చెప్పి నానికి `ఎస్` అందా?

By:  Tupaki Desk   |   3 Jun 2016 8:16 AM GMT
ప‌వ‌న్‌ కి `నో` చెప్పి నానికి `ఎస్` అందా?
X
సినిమా ఇండస్ట్రీలో బోలెడ‌న్ని రూమ‌ర్లు వినిపిస్తుంటాయి. వాటిలో నిజ‌మ‌య్యేవి కొన్న‌యితే అబ‌ద్ధంగా తేలేవి బోలెడ‌న్ని. తాజాగా వినిపిస్తున్న ఓ రూమర్ ఏంటంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో న‌టించే ఆఫ‌ర్ వ‌స్తే కీర్తి సురేష్ నో చెప్పింద‌ని! ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ లాంటి స్టార్ కథానాయ‌కుడి సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌స్తే మేగ్జిమ‌మ్ ఏ హీరోయిన్ కూడా వ‌ద‌లుకోలేదు. కానీ కీర్తి వ‌దులుకొందంటే ఎలా న‌మ్మాలి? డేట్లు ఖాళీ లేకుంటాయని, అందుకే వ‌ద్ద‌నుకొంద‌ని మాత్ర‌మే అనుకోవాలి. మ‌రి నిజంగా కీర్తి ద‌గ్గ‌రికి ఆఫ‌ర్ వెళ్లిందా లేదా అన్న‌ది మాత్రం ఇప్ప‌టికీ డౌటే.

ఇక రెండో విష‌యానికొస్తే కీర్తిసురేష్ తాజాగా నానితో క‌లిసి న‌టించేందుకు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. మ‌రి ప‌వ‌న్‌ కి నో చెప్పి నానికి ఎస్ ఎందుకంద‌న్న‌దే అస‌లు ప్ర‌శ్న‌. బ‌హుశా త‌మిళంలో త‌ను ఒప్పుకొన్న క‌మిట్‌ మెంట్ల త‌ర్వాతే నానితో న‌టించేందుకు ఒప్పుకొని ఉంటుంద‌నుకోవాలి స‌రిపెట్టుకోవాలి మ‌నం. అదే నిజం కావచ్చు కూడా. నాని క‌థానాయ‌కుడిగా దిల్‌ రాజు సంస్థ‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని స‌మాచారం. సినిమా చూపిస్త మావ ఫేమ్ త్రినాథ‌రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని తెలుస్తోంది. అందులో కథానాయిక‌గా కీర్తి సురేష్‌ ని ఎంచుకొన్న‌ట్టు, ఆమె ఆఫ‌ర్ రాగానే ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. నేను శైల‌జ‌తో మంచి గుర్తింపు తెచ్చుకొంది కీర్తి. ఆ త‌ర్వాత కూడా ఆమెకి బోలెడ‌న్ని ఆఫ‌ర్లు ఇచ్చింది తెలుగు ఇండ‌స్ట్రీ. కానీ త‌మిళంలో బిజీ అవ‌డంతో తెలుగు సినిమాలు చేయ‌లేక‌పోయింది. ఎట్ట‌కేల‌కి నాని సినిమాకి ఆమె కాల్షీట్లు కేటాయించింద‌ని తెలుస్తోంది.