Begin typing your search above and press return to search.

మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి

By:  Tupaki Desk   |   20 Jan 2016 5:45 AM GMT
మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి
X
కొత్త యేడాది ఆరంభం రోజున తెలుగు తెర‌పై ఓ కొత్తందం మెరిసిపోయింది. ఆ అందం గురించి ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకున్నారు. త్వ‌ర‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న ఛాన్స్ కొట్ట‌డం ఖాయం అనేశారు. ఆ మాట‌లే నిజ‌మ‌వుతున్నాయిప్పుడు. నేను శైల‌జ‌తో మెరిసిన కీర్తి సురేష్‌కి టాలీవుడ్‌ లో క్రేజీ ఆఫ‌ర్లు ల‌భిస్తున్నాయి. తాజాగా మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని ఆమె సొంతం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆ చిత్రం మొద‌లు కాబోతోంది. అందులో హీరోయిన్ అంటూ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా పలువురి పేర్లు వినిపించాయి. కానీ కీర్తి సురేష్‌ కే ఆ ల‌క్కీ ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. ఆ విష‌యాన్ని కీర్తి కూడా ఓ ఇంట‌ర్వ్యూ లో ధృవీక‌రించింది.

మ‌రో విశేష‌మేంటంటే నేను శైల‌జ ప్ర‌చారంలో భాగంగా మీడియాతో ఇంట‌రాక్ట్ అవుతూ త‌న అభిమాన క‌థానాయ‌కుడు మ‌హేష్‌ బాబు అని చెప్పింది కీర్తి. అలా చెప్పిందో లేదో ఆ వెంట‌నే ఆయ‌న స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని సొంతం చేసుకుంది. కీర్తిని స్వ‌యంగా మ‌హేష్‌ బాబే ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. నేను శైల‌జ‌తోనే కీర్తి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ప్ప‌టికీ మ‌హేష్ మాత్రం ఆమెని ఎప్ప‌ట్నుంచో ప‌రిశీలిస్తున్నాడ‌ట‌. విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ విజ‌య్‌ కృష్ణ చిత్రం `ఐనా ఇష్టం నువ్వు ` ఓపెనింగ్‌ కి మ‌హేష్‌ బాబు హాజ‌ర‌య్యాడు. ఆ వేడుక‌లోనే కీర్తిని చూశాడ‌ట మ‌హేష్‌. అయితే ఆ చిత్రం ఇంకా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఇంత‌లో కీర్తి రెండో చిత్రంగా చేసిన నేను శైల‌జ మొద‌ట విడుద‌లైంది. ఆ చిత్రంతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. త‌మిళంలోనూ కీర్తికి క్రేజీ ఆఫర్లే ల‌భిస్తున్నాయి. తెలుగులో రామ్‌ చ‌ర‌ణ్ సినిమాకోసం కూడా కీర్తిని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది.