Begin typing your search above and press return to search.

రామ్ హీరోయిన్‌.. హాట్ అంటే హాట్

By:  Tupaki Desk   |   7 Jan 2016 9:30 AM GMT
రామ్ హీరోయిన్‌.. హాట్ అంటే హాట్
X
కీర్తి సురేష్.. ‘నేను శైలజ’ రిలీజ్ అయిన నాటి నుంచి టాలీవుడ్ లో ఈ పేరు బాగా చర్చనీయాంశమవుతోంది. అమాయకత్వం, అయోమయం కలగలిసిన శైలజ పాత్రలో తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్రే వేసింది కీర్తి. మొదట్లో ఆమె నటన గురించి కొంత నెగెటివ్ కామెంట్లు కూడా పడ్డాయి కానీ.. నెమ్మదిగా ఆమె గురించి పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్ల నుంచి బయటికి వచ్చాక కూడా శైలజ జనాల్ని వెంటాడుతూ.. వాళ్ల మనసుల్లోకి చొచ్చుకుపోతోంది. సక్సెస్ రేటు బాగా తక్కువ ఉండే సినీ పరిశ్రమలో తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన హీరోయిన్ని ఈజీగా వదిలేస్తారా.. వెంటపడి మరీ అవకాశాలు గుప్పిస్తారు.

కీర్తి కోసం చాలామందే లైన్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ తర్వాతి సినిమాకు ఆమెను అడుగుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ ‘తనీ ఒరువన్’ కోసం కూడా ఆమె పేరు పరిశీలనలో ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని వార్తలొచ్చాయి కానీ.. నిజానికి ఇంకా హీరోయిన్ ఖాయం కాలేదట. అన్నీ కలిసొస్తే చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసినా కొట్టేస్తుంది కీర్తి. తొలి సినిమాలో పాత్ర దృష్ట్యా మూడీగా కనిపించింది కానీ.. చలాకీ పాత్రలిచ్చినా బాగా చేయగల టాలెంట్ ఆమెకుందని అర్థమైంది. ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో కీర్తి తన టాలెంట్ చూపించింది కూడా. త్వరలోనే కీర్తి తెలుగులో బిజీ హీరోయిన్ గా మారినా ఆశ్చర్యమేమీ లేదు.