Begin typing your search above and press return to search.

అప్పుడే రెండోది కొట్టేసిన శైలజ

By:  Tupaki Desk   |   14 Jan 2016 4:09 PM GMT
అప్పుడే రెండోది కొట్టేసిన శైలజ
X
మళయాళీ సుందరికి కీర్తి సురేష్ కి ఈ ఏడాది బాగానే కలిసొస్తోంది. ఏడాది మొదటి రోజునే రామ్ తో కలిసి నేను.. శైలజ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది కీర్తి సురేష్. న్యూ ఇయర్ నాడు రిలీజ్ అయిన ఈ మూవీ.. బంపర్ హిట్ అనిపించుకుంది. కలెక్షన్స్ విషయంలో కూడా దిమ్మ తిరిగే వసూళ్లు వచ్చాయి. తొలి చిత్రమే టాలీవుడ్ లో హిట్ కావడంతో.. మంచి హ్యాపీగా ఉన్న కీర్తికి, ఇప్పుడు సంక్రాంతి నాడు మరో పండుగ కూడా వచ్చేసింది.

కోలీవుడ్ లో ఈ బొద్దు భామ నటించిన రెండో సినిమా రజినీ ముురగన్. శివకార్తికేయన్ సరసన కీర్తి నటించిన ఈ సినిమా.. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది. పొంగల్ రిలీజ్ లలో సూపర్బ్ టాక్ వచ్చిన ముూవీ రజినీ మురుగన్ కావడం విశేషం. కామెడీ డ్రామా కావడంతో.. అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఓ భారీ బడ్జెట్ మూవీ రేంజ్ లో.. ఈ రజినీ మురుగన్ గురించి ఆన్ లైన్ లో డిస్కషన్స్ సాగుతున్నాయంటే.. ఈ మూవీ ఎంతగా టాక్ సంపాదించిందో అర్ధమవుతుంది.

పాజిటివ్ మౌత్ టాక్ కూడా ఎక్కువగా ఉండడంతో.. ఈ మూవీ హిట్ స్థాయిని మించిపోతుందంటున్నారు కోలీవుడ్ జనాలు. మొత్తానికి కొత్త ఏడాది తొలి 15 రోజుల్లోనే 2 బ్లాక్ బస్టర్స్ అనిపించుకోదగ్గ సినిమాలు చేసిన కీర్తి సురేష్ క్రేజ్ అమాతం ఆకాశాన్నంటుతోంది.