Begin typing your search above and press return to search.

కీర్తి కీర్తి అని క‌ల‌వ‌రిస్తున్నారు

By:  Tupaki Desk   |   10 Jan 2016 4:17 AM GMT
కీర్తి కీర్తి అని క‌ల‌వ‌రిస్తున్నారు
X
కీర్తి సురేష్.. టాలీవుడ్‌ లో లేటెస్ట్ సెన్సేష‌న్‌. నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు.. కోలీవుడ్‌ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. అక్క‌డ ధ‌నుష్ స‌ర‌స‌న రైల్ అనే చిత్రంలో న‌టిస్తోంది. తెలుగు సినిమా హిట్టు, సూప‌ర్‌ హిట్టు అంటూ ప్ర‌చారం సాగింది కాబ‌ట్టి అది ఈ అమ్మ‌డికి అన్నిచోట్లా ఉప‌యోగ‌ప‌డుతోంది. ముఖ్యంగా శైల‌జ సినిమాని ఎంట్రీ టిక్కెట్టులా ఉప‌యోగించుకుంటోంది.

నేను- శైల‌జ ప్ర‌మోష‌న్ ఎవ‌రికి క‌లిసొచ్చినా, రాక‌పోయినా ఈ అమ్మ‌డికి బాగా క‌లిసొచ్చింద‌ని అంతా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ప్ర‌స్తుతం సౌత్‌ లోకి దూసుకొచ్చిన‌ న్యూ వేవ్ ఈ అమ్మ‌డు. మునుముందు హీరోయిన్ల కొర‌త‌ను తీర్చేందుకు త‌న‌వంతు పాత్ర పోషించ‌బోతోంది. ఇప్ప‌టికే రాశీఖ‌న్నా- ర‌కూల్ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వంటి నాయిక‌లు కాస్తంత లోటు బ‌ర్తీ చేస్తున్నారు. వేడినీళ్ల‌కు చ‌న్నీళ్ల‌లా ఈ అమ్మ‌డి తోడు క‌లిసొస్తుంది. అస‌లే కుర్ర హీరోలంతా స‌రి జోడు దొరక్క విసిగి వేసారి పోతున్నారు. క‌న్వీనెంట్ అనిపించే హీరోయిన్లు లేక నానా తంటాలు ప‌డుతున్నారు. ముంబై - బెంగ‌ళూరు వెళ్లి వెతుక్కోవాల్సొస్తోంది. కాబ‌ట్టి చేరువ‌లో ఉన్న కీర్తికి మ‌రిన్ని ఛాన్సులిచ్చి ఎంక‌రేజ్ చేసే ఛాన్సుంది మరి. దీపం వెలిగింది. ఆర‌క‌ముందే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి సుమీ.

ఇకపోతే పనిలో పనిగా అమ్మడు చాలా మ్యాగజైన్‌ కవర్‌ పేజీలకు కూడా ఎక్కేస్తోంది. చెన్నయ్‌ నగరం నుండి వెలువడే 'వుయ్‌' మ్యాగజైన్‌ పై అమ్మడు తళుక్కుమంది. టాలీవుడ్‌ లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌.