Begin typing your search above and press return to search.

కాజల్ ను టార్గెట్ చేసినట్లుంది..!

By:  Tupaki Desk   |   18 Feb 2016 5:30 AM GMT
కాజల్ ను టార్గెట్ చేసినట్లుంది..!
X
చలన చిత్ర పరిశ్రమలో హీరోల కంటే హీరోయిన్ల మధ్య కాంపిటిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోయిన్లు మారుతూనే ఉంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పది సంవత్సరాలు ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో చెలామణి అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సమంత - కాజల్ లు సైతం తమ మకాంను చెన్నైకు షిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు. వారికి క్రేజ్ ఉన్న సమయంలోనే ఎక్కువ సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తుంటారు.

తెలుగులో అవకాశాలు కరువై తమిళంలో నటిస్తోన్న కాజల్ కు అక్కడ కూడా చాన్సులు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నటి కీర్తి సురేష్. ఇప్పుడామె కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. తాజాగా కాజల్ కి షాక్ ఇచ్చింది కీర్తి. తమిళ్ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా భరతన్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా తొలుత కాజల్ ను అనుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో గాని ఇప్పుడీ స్థానంలోకి కీర్తి సురేష్ వచ్చింది. అలానే హీరో కార్తి నటిస్తోన్న మరో సినిమాలో కూడా మొదట కాజల్ ను అనుకొని ఇప్పుడు కీర్తి సురేష్ ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారట.