Begin typing your search above and press return to search.

లోకల్ పాప.. రైల్ లో చిక్కినట్లుందే

By:  Tupaki Desk   |   4 Sep 2016 6:38 AM GMT
లోకల్ పాప.. రైల్ లో చిక్కినట్లుందే
X
మలయాళీ కుట్టి కీర్తి సురేష్ బాగా ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అనే సంగతి ఒప్పుకోవాల్సిందే. ఎనర్జిటిక్ హీరో రామ్ పక్కన చేసినా... తన మార్క్ యాక్టింగ్ తో బాగా అట్రాక్ట్ చేసింది. అయితే.. అమ్మడు కొంచెం బొద్దుగా ఉండడంతో ఈ భామకు టాలీవుడ్ నుంచి వెంటనే పిలుపు రాలేదు. కానీ బొద్దు భామలను బాగా ఎంకరేజ్ చేసే కోలీవుడ్ జనాలు మాత్రం కీర్తిని బాగానే ఆదరించారు.

ప్రస్తుతం ఈ భామ ధనుష్ తో కలిసి నటించిన తొడరి రిలీజ్ కి రెడీ అయింది. దీన్ని తెలుగులో రైల్ అనే పేరుతో డబ్బింగ్ చేయగా.. రీసెంట్ గా రైల్ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ వేడుకకు హీరోయన్ కీర్తి సురేష్ హాజరైంది. వైట్ అండ్ వైట్ భలే మెరిసిపోయింది ఈ భామ. ఫంక్షన్ లో కీర్తినే స్పెషల్ అట్రాక్షన్. అబ్జర్వ్ చేస్తే.. నేను శైలజ చిత్రంలో కనిపించిన పర్సనాలిటీకి.. ఇప్పటి కీర్తికి బాగానే డిఫరెన్స్ కనిపిస్తుంది. తన సైజ్ పై వచ్చిన విమర్శలపై అమ్మడు బాగానే కాన్సంట్రేట్ చేసినట్లుంది. అందుకే కాసింత చిక్కిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా వైట్ అండ్ వైట్ లో ఏంజెల్ ని తలపించేసింది ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ.

ప్రస్తుతం ఈ భామ ఓ టాలీవుడ్ మూవీలో యాక్ట్ చేస్తోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి 'నేను లోకల్' మూవీలో ఈ బ్యూటీ కనిపించనుంది. అటు నాని.. ఇటు కీర్తి.. ఇద్దరూ కలిసి ట్యాలెంట్ చూపించేస్తే.. ఇక స్క్రీన్ లో మెరుపులు వెలుగులు ఖాయమే అనుకోవచ్చు.