Begin typing your search above and press return to search.

బొండు మల్లిలా మెరిసిన బొద్దు భామ

By:  Tupaki Desk   |   22 Dec 2015 4:03 AM GMT
బొండు మల్లిలా మెరిసిన బొద్దు భామ
X
ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన నటిస్తూ.. మళయాళీ బొద్దుగుమ్మ కీర్తి సురేష్ టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. దీనికి ముందే ఓ తెలుగు మూవీలో నటించింది ఈ భామ. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా రూపొందిన "అయినా ఇష్టం నువ్వు" అనే సినిమా చేసినా.. అది రిలీజ్ కి నోచుకోలేదు.

ఇప్పుడు రామ్ మూవీతో శైలజగా ప్రేక్షకులకు పరిచయం కానుంది ఈ బొద్దు భామ. చైల్డ్ యాక్టర్ గా చేసినప్పటి నుంచి సురేష్ కృష్ణ వంటి పెద్ద డైరెక్టర్లతో చేయడం, హీరోయిన్ గా అరంగేట్రమే ప్రియదర్శన్ లాంటి లెజెండరీ దర్శకుడి మూవీ కావడంతో.. ఈ భామ ఎక్స్ పోజింగ్ కి ససేమిరా అనేసింది. దీనికి తోడు పర్సనాలిటీ కూడా పెద్దది కావడంతో.. గ్లామర్ విషయంలో ఎవరూ ప్రెజర్ కూడా చేయలేదు. పెర్ఫామెన్స్ విషయంలో పేరు పెట్టే అవకాశం లేకపోవడంతో.. ఎక్స్ పోజింగ్ పై డిమాండ్స్ లేవు.

అయితే.. నేను శైలజ ఆడియో ఫంక్షన్ కి మాత్రం స్లీవ్ లెస్ డ్రస్ వేసుకొచ్చి అందాలను ప్రదర్శించే ప్రయత్నం చేసింది. తన పర్సనాలిటీ సూటబుల్ డ్రస్ కావడంతో.. అది కూడా బాగానే ఉందనిపించింది. తన స్కిన్ టోన్ కి మ్యాచయ్యే డ్రస్ తో బాగా ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఇక రామ్ లాంటి ఎనర్జీ ఉన్న హీరోని చూడలేదని.. ఒక్క మాటలో చెప్పాలంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటూ.. తన హీరోని ఆకాశానికి ఎత్తేసింది కీర్తి సురేష్.