Begin typing your search above and press return to search.

తొలి ప్రేమ బ్యూటీ.. షాకిస్తోందిలా!

By:  Tupaki Desk   |   6 Feb 2019 5:03 PM GMT
తొలి ప్రేమ బ్యూటీ.. షాకిస్తోందిలా!
X
`తొలి ప్రేమ‌` (1998) సినిమాని త‌ల‌చుకోని ప‌వ‌న్ అభిమాని ఉండ‌డు. అలాగే ఆ చిత్రంలో త‌న‌దైన అందం, న‌ట‌న‌తో మాయ చేసిన కీర్తి రెడ్డిని అస‌లే మ‌ర్చిపోలేరు. క‌రుణాక‌ర‌ణ్ తెర‌కెక్కించిన ఆ చిత్రం ఇప్ప‌టికీ ఓ వండ‌ర్ గా నిలిచిపోయింది. బుల్లితెర టీఆర్‌పీల్లో తొలిప్రేమ ఇప్ప‌టికీ ఏమాత్రం త‌గ్గ‌లేదు.

తొలి ప్రేమ త‌ర్వాత కీర్తి రెడ్డి ఓ అర‌డ‌జ‌ను చిత్రాల్లో న‌టించి మెప్పించింది. మ‌హేష్ బాబు న‌టించిన `అర్జున్` చిత్రంలో అత‌డికి సిస్ట‌ర్ పాత్ర‌లో న‌టించి మైమ‌రిపించింది. ఆ త‌ర్వాత అక్కినేని మ‌న‌వ‌డు సుమంత్ ని కీర్తి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆ ఇద్ద‌రి మ‌ధ్యా విడాకులు.. అటుపై కీర్తి రెడ్డి వేరొక బిజినెస్ మేన్ ని పెళ్లాడి అమెరికాలో వెళ్లిపోవ‌డం తెలిసిందే. అటుపై అమెరికా నుంచి వ‌చ్చి బెంగ‌ళూరులో ఈ ఫ్యామిలీ సెటిలైందిట‌. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్ వ‌చ్చి వెళుతుండ‌డం, ఇక్క‌డ రిలేష‌న్స్ తో క‌లుస్తుండ‌డం చేస్తున్నార‌ట‌.

అప్పుడు సెడెన్ గా సినీరంగం నుంచి మిస్స‌య్యి ఇన్నాళ్లికి మ‌ళ్లీ హైద‌రాబాద్ స‌ర్కిల్స్ లో కీర్తి రెడ్డి మెరుస్తున్నార‌ట‌. మ‌ళ్లీ ఇంత‌కాలానికి మారిన కొత్త రూపంతో ప్ర‌త్య‌క్ష‌మైంది. అస‌లింత‌కీ కీర్తి రెడ్డి ఏం చేస్తోంది? అన్న‌ది అటుంచితే తిరిగి ముఖానికి రంగేసుకుని న‌టిస్తారా? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఒక‌వేళ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తుందేమో?