Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం దిగొచ్చిన కీరవాణి

By:  Tupaki Desk   |   29 Oct 2017 7:00 AM IST
ఎన్టీఆర్ కోసం దిగొచ్చిన కీరవాణి
X
టాలీవుడ్ టాప్ సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణి పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈయన సంగీతం అందించిన బాహుబలి సిరీస్ సాధించిన సక్సెస్ అసామాన్యం. బాహుబలి తర్వాత చాలా సెలెక్టివ్ గా ఉంటానని.. తన దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలను అంగీకరించబోనని రీసెంట్ గానే చెప్పారు కీరవాణి. అయితే.. ఎన్టీఆర్ పేరుతో ఆయన బయోపిక్ గా రూపొందుతున్న చిత్రానికి సైన్ చేసేందుకు పెద్దగా సమయం తీసుకోలేదని అంటున్నారు.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి బాలయ్యతో పాటు సాయి కొర్రపాటి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు కీరవాణి సైన్ చేశారని.. అది కూడా తను సహజంగా తీసుకునే మొత్తం కంటే తక్కువకే అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. కీరవాణి ఇలా తగ్గడానికి కారణాలు లేకపోలేదు. సీనియర్ ఎన్టీఆర్ కు కీరవాణి చాలా పెద్ద ఫ్యాన్. అంతే కాదు.. బాలకృష్ణ అంటే కూడా బోలెడంత ప్రత్యేకమైన అనుభవం ఉంది.

వీటితోపాటు సాయి కొర్రపాటితో కూడా ఈయనకు సహచర్యం ఎక్కువే. అందుకే కొంత తక్కువ మొత్తానికే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చేందుకు అంగీకరించారట. తేజ-బాలకృష్ణ.. తేజ-కీరవాణి.. ఇలా ఎన్టీఆర్ బయోపిక్ కు చాలానే తొలి కాంబినేషన్స్ సెట్ కానున్నాయి.