Begin typing your search above and press return to search.
కీరవాణి కొడుకుల 'తెల్లారితే గురువారం' రిలీజ్ డేట్ ఫిక్స్..!
By: Tupaki Desk | 11 Feb 2021 7:25 PM ISTప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇద్దరు కుమారులు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'మత్తు వదలరా' సినిమాతో చిన్న కొడుకు సింహా హీరోగా.. పెద్ద కొడుకు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'తెల్లారితే గురువారం' అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాతో మణికాంత్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం - లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి - రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ ని చిత్ర బృందం అనౌన్స్ చేసింది.
'తెల్లారితే గురువారం' సినిమాని మార్చి 27న విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ అనౌన్సమెంట్ పోస్టర్ ని వదిలారు. ఇందులో ఒక హీరోయిన్ పెళ్లి కూతురు గెటప్ లో కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా.. పక్కనే పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న హీరో ఒళ్ళో మరో హీరోయిన్ కూర్చొని కనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తే ఇది ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రీసింహా సరసన చిత్రా శుక్లా - మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు.