Begin typing your search above and press return to search.

సుకుమార్ చుట్టూ తిప్పించిన కీరవాణి

By:  Tupaki Desk   |   4 March 2018 4:22 AM GMT
సుకుమార్ చుట్టూ తిప్పించిన కీరవాణి
X
90వ దశకంలో ఇళయరాజా, మహదేవన్, చక్రవర్తి, రాజ్-కోటి శకం ఉదృతంగా ఉన్న టైంలో ప్రవేశించిన కీరవాణి ఇంత స్థాయికి చేరుకుంటాడని మొదటి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు ఊహించారో లేదో కాని అంతకు మించిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు ప్రఖ్యాతులు గడించిన కీరవాణి హిందీ సినిమాలకు క్రీం పేరుతో మ్యూజిక్ ఇస్తూ ఉంటారు - వర్మ జిఎస్టికి కూడా అదే పేరుతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో షేర్ చేసుకున్న కీరవాణి అందులో ఎన్నో ఆసక్తికరమైన సంగతులు షేర్ చేసుకున్నారు. తన ప్రస్థానం మొదలుకొని జీవితంలో ఎదుర్కున్న ఆటుపోట్ల దాకా ప్రతిదీ వివరించిన కీరవాణి తాను పాటించే విలువల గురించి ఒక షాకింగ్ ఇన్సి డెంట్ పంచుకున్నారు.

డిగ్నిటీ అఫ్ లేబర్ ని బలంగా నమ్మే తాను అది తన కుటుంబంలో కూడా ఉండాలని కోరుకుంటారట. ఓసారి కీరవాణి తన ఇద్దరి అబ్బాయిలను హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ఒక్క ఫ్యాక్టరీలో రోజు కూలి పనికి పంపించారు. అప్పుడున్న లెక్క ప్రకారం ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున ఇచ్చారు. అంటే రెండు కలిపితే కూడా కాఫీ షాపులో బిల్ కూడా కట్టలేని తక్కువ మొత్తం వచ్చింది అని వివరించి టీకే రోజంతా కష్టపడితే మరి భోజనానికి ఇంకెంత చేయాలో అలోచించుకోమని చెప్పారు. తర్వాత కీరవాణి అబ్బాయి శ్రీసింహా దర్శకత్వ శాఖలో ఆసక్తి చూపిస్తే తన పేరు వాడకుండా సాధించుకోమని చెప్పి పంపారు. సుకుమార్ ఆఫీస్ చుట్టూ మూడు నెలలు కళ్ళు అరిగేలా తిరిగి పలుమార్లు కలిసి చివరికి ఆ అబ్బాయి శ్రీసింహా అనుకున్నది సాధించేలా చేసుకున్నాడు.

ఇదంతా కీరవాణినే వివరించారు. పేరెంటింగ్ ఎలా ఉండాలో ఈ సంఘటన ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేసారు. అడిగినంతా ఇచ్చి కోరినదంతా కొనిచ్చి అతి గారాబం చేసి ఆ తర్వాత బాధ పడే తల్లితండ్రులకు ఇది మంచి పాఠం అని చెప్పొచ్చు. కీరవాణి పేరు చెబితే సుకుమారే కాదు ఎవరైనా అవకాశం ఇస్తారు. అలా కాకుండా స్వంత టాలెంట్ తోనే ఋజువు చేసుకోవాలన్న కీరవాణి ప్రిన్సిపుల్ బాగుంది కదూ.