Begin typing your search above and press return to search.

సారా పెద‌వి ముద్దు మ‌తిచెడాలే

By:  Tupaki Desk   |   30 Oct 2018 10:22 AM GMT
సారా పెద‌వి ముద్దు మ‌తిచెడాలే
X
బాలీవుడ్‌ లో వార‌స‌త్వ‌(నెప్టోయిజం) నాయిక‌ల ట్రెండ్ ఎక్కువ‌గా కొన‌సాగుతోంది. సెల‌బ్రిటీ కుమార్తెలు క‌థానాయిక‌లుగా రాణిస్తున్నారు. క‌రీనాక‌పూర్ - శ్ర‌ద్ధా క‌పూర్ - సోన‌మ్ క‌పూర్ - అలియా భ‌ట్ - సోనాక్షి సిన్హా వీళ్లంతా సీనియ‌ర్లు అయిపోయారు. న‌వ‌త‌రంలో జాన్వీ క‌పూర్ - సారా అలీఖాన్ - అహ‌నా పాండే లాంటి భామ‌లు వార‌త‌స‌త్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఇటీవ‌లే జాన్వీ ధడ‌క్ చిత్రంతో తెరంగేట్రం చేసింద‌. ఆరంగేట్రం అద‌ర‌గొట్టిందన్న టాక్ వినిపించింది. సైఫ్ అలీఖాన్ మొద‌టి భార్య కుమార్తె సారా అలీఖాన్ కేదార్‌ నాథ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇందులో సుషాత్ సింగ్ రాజ్ పుత్ స‌ర‌స‌స‌న సారా రొమాన్స్ చేస్తోంది. తాజాగా ఆ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను యూనిట్ రివీల్ చేసింది. పోస్ట‌ర్ లో ఫెయిర్ క్యూట్ అప్పీల్‌ తో మైమ‌రిపించింది. మంచు కొండ‌ల అందాల న‌డుమ డిజైన్ చేసిన పోస్ట‌ర్ ఆహ్లాద‌క‌రంగా ఉంది. సారా-సుశాంత్ ల జోడీ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ఇక ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ చూడాలంటే రెండు క‌ళ్లు చాల‌వేమో. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

గ‌తంలో జాన్వీ క‌పూర్ డెబ్యూ మూవీ `ధ‌డ‌క్` పోస్ట‌ర్ అప్ప‌ట్లో సంచ‌ల‌న సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రిలీజైన గంట‌ల వ్య‌వ‌ధిలోనే షేర్లు - లైకుల‌తో సోష‌ల్ మీడియాను ఊపేసింది. శ్రీదేవి త‌న‌య కావ‌డంతో ఆ రేంజ్ లో ట్రెండ్ అయింది. మ‌రి ఇప్పుడా రికార్డులను సారా అందుకుంటుందా.. లేదా? అన్న డిబేట్ న‌డుమ తాజాగా `కేదార్‌ నాథ్‌` టీజ‌ర్ రిలీజైంది. కొన్ని సెక‌న్ల పాటు ఉత్కంఠగా వీక్షించేంత విజువ‌ల్ బ్యూటీతో టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. కేదార్‌ నాథ్ టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే ప‌ర‌మ‌శివుడు కొలువున్న హిమాల‌యాల్లో సాగే అద్భుత‌మైన ప్రేమ‌క‌థ ఇది. ఒకానొక భీక‌ర‌మైన ఉత్పాతం వేళ గంగ ఏరులై పారితే ఈ ప్ర‌వాహంలో ప్రేమికులు కొట్టుకుపోతారు. అయితే త‌మ‌ను విడ‌దీసేది గంగ‌మ్మ కాదు.. అంద‌రి ప్రేమ‌క‌థ‌ల్లానే సారా- సుశాంత్ జంటను విడ‌దీసే విల‌న్లు ఉన్నారు. కొన్ని సెక‌న్ల పాటు సారా అంద‌చందాలు .. క‌వ్వింత కుర్ర‌కారును క‌ళ్ల‌ప్ప‌గించేలా చేసిందంటే అతిశ‌యోక్తి కాదు. పైగా టీజ‌ర్ ఆరంభ‌మే సారా ఇచ్చే పెద‌వి ముద్దుతో మ‌రింత ఉద్వేగం పెంచింది. జాన్వీకి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ సారా అన‌డంలో సందేహం లేదు. `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2` చిత్రంతో అహ‌నా పాండే ఈ ఇద్ద‌రికీ పోటీనిస్తుందేమో చూడాలి. `కేధార్‌ నాథ్‌` చిత్రాన్ని డిసెంబ‌ర్ 7న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్నారు. అభిషేక్ క‌పూర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.