Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కు కేసీఆర్ ఇచ్చిన వరమే ఇదీ.?

By:  Tupaki Desk   |   10 Jun 2020 12:10 PM GMT
టాలీవుడ్ కు కేసీఆర్ ఇచ్చిన వరమే ఇదీ.?
X
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలంగా ఉంది. మహారాష్ట్రలో అయితే విలయతాండవమే చేస్తోంది. బాలీవుడ్ చిత్రపరిశ్రమకు కేంద్రమైన ముంబైలో 15 రోజుల క్రితం సినిమాలు,టీవీ షోల చిత్రీకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే కఠినమైన షరతులు పెట్టడంతో ఇప్పటికీ అక్కడ షూటింగ్ లు ప్రారంభం కాలేదు. 60 ఏళ్లకు పైబడిన నటీనటులు, టెక్నీషియన్లు , సిబ్బంది పనిచేయడానికి అనుమతించకపోవడమే ఈ ఆటంకానికి కారణంగా తెలుస్తోంది.

అయితే తెలంగాణలో లేట్ గానైనా చిత్రీకరణలకు అనుమతిచ్చిన కేసీఆర్ టాలీవుడ్ సీనియర్లకు ఊరటనిచ్చాడు. 60 ఏళ్ల పైబడిన వయసు వారు షూటింగ్ లో పాల్గొనేలా వెసులుబాటు ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున, బాలయ్య సహా నటులు అంతా 60 ఏళ్లకు అటూ ఇటూ వారే కావడంతో ఈ నిబంధన సినీ పరిశ్రమకు ఊరటగా నిలిచింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం నిలిచిపోయిన సినిమాలు.. టెలివిజన్ షూటింగ్ మాత్రమే పూర్తి చేయవచ్చని నిబంధనలు పెట్టింది. కానీ కొత్త సినిమాలను ప్రారంభించడానికి వీల్లేదంది. షూటింగ్ పూర్తయిన వాటికే పోస్ట్ ప్రొడక్షన్ అనుమతిస్తామని తెలిపింది. ఇది కొంతమేర నిర్మాతలను ఇబ్బంది పెట్టేదిగా మారిందట..

ఎందుకంటే తాజాగా మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ అంటూ సినిమా మొదలుపెట్టాడు. ఇది కొత్త సినిమా కావడంతో దీనికి అనుమతులు లభించడం కష్టమేనంటున్నారు.